ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ వైజాగ్ అధ్యక్షుడిగా నన్ను తొలగించినట్లు వైజాగ్ ఆంధ్రజ్యోతి దినపత్రికలో వార్త వచ్చింది. అది పూర్తిగా అసత్యం. ఇప్పటికీ నేనే దానికి అధ్యక్షుడిగా ఉన్నానని` ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా గురువారంనాడు హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన కూలంకషంగా మాట్లాడారు.
- ఎఫ్.ఎన్.సి.సి వైజాగ్ లో రూ 30 కోట్లు నిధులు దుర్వినియోగం అయ్యా అనడం కూడా అవాస్తవం.
- ఎవరో సరైన అవగాహన లేక ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసుంటారని అనుకుంటున్నాను.
- ఎఫ్ ఎన్ సి సి వైజాగ్‌కు గత ప్రభుత్వాలు రెండు చోట్ల స్థలాలు ఇచ్చాయి. ఆ స్థలాన్ని అభివృద్ధి పనుల కోసం మాకు అప్పగించడంలో ఇప్పటి ప్రభుత్వం తాత్సారం చేస్తోంది అని వివరించారు.
పూర్తి వివరాలను ఆయన తెలియజేస్తూ, వైజాగ్ ఎఫ్.ఎన్.సి.సి. అధ్యక్షుడిగా నేను, వైస్ ప్రెసిడెంట్‌గా వెంకట్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా ప్రముఖ పంపిణీదారులు కాంతిరెడ్డి వున్నాం. ఇటీవలే వైజాగ్‌లో ఓ సమావేశం కూడా ఏర్పాటు చేశాం. ఏకగ్రీవంగా మా కమిటీని అభివృద్ధికి కృషిచేయమని ఆమోదం తెలతిపారు. ఇప్పుడు షడెన్‌గా ఇలా వార్త రావడం ఆశ్చర్యానికి గురిచేసింది.
- విశాఖటప్నంలో అక్కడి సినిమారంగానికి చెందిన వివిధ శాఖలవారే సభ్యులుగా వున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం తొట్లకొండలో కొంత స్థలం ఇచ్చింది. శంకుస్థాపన కూడా చేశాం. కానీ అది టూరిస్ట్ ప్లేస్ అని కొంతమంది బుద్ధిజంకు చెందిన వారు నిరసన తెలిపారు. అప్పుడు మరో ప్రాంతానికి మారితే బాగుంటుందని అనుకున్నాం. మరలా అప్పటి సి.ఎం.ను అడిగాం. డా. డి. రామానాయుడుగారి స్టూడియో దగ్గర కొండ ప్రాంతంలో కేటాయించారు. అయితే స్థలం మా చేతికి ఇంకా అందలేదు. ప్రభుత్వాలు యంత్రాంగం ప్రజల సమస్యలపై బిజీగా వుండడంతో మా చేతికి స్థలం రాలేదు. ఆ సమయంలో నరసింహరాజు అనే మిత్రుడు ఓ స్థలం ద్వారా మాకు సహకరించారు. లీజు విధానంపై అక్కడ కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేశాం. అయితే నిన్న పేపర్ వార్తలో నన్ను తొలగించారని వచ్చింది.
- ఐదేళ్ళుగా వయస్సురీత్యా ఇతరత్రా కారణాలవల్ల హైదరాబాద్ టు వైజాగ్ తిరగడంలో కొంత జాప్యం జరిగింది. అందుకే అక్కడివారితోనే పనులు చేయించాలని అనుకున్నాం. కానీ అక్కడి ప్రతీ సభ్యుడు నన్నే అధ్యక్షుడిగా వుంటాలని కోరుకోవడంతో నేను కొనసాగుతున్నాను. నేను అధ్యక్షుడిగా వున్నా. కానీ ఎవరో న్యూస్ ద్వారా సభ్యులను, ఇటు ప్రభుత్వాన్ని గందరగోళ పరుస్తున్నారు. దాదాపు 1250 మంది సభ్యులున్నారు.
- ఇండస్ట్రీ ఆంధ్రలో అభివృద్ధి చెందాలని చూస్తున్న తరుణంలో ఇలాంటి వార్త రావడం అందరినీ కన్‌ఫ్యూజ్ చేయడమే. ఈ సెంటర్‌లో సభ్యులంతా కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగానే వున్నారు. ఇక్కడ హైదరాబాద్‌లో క్లబ్‌లో అంతా ఒకే కుటుంబంలా వున్నాం. ఏది ఏమైనా అవగాహన లేకుండా ఇలాంటి తప్పుడు వార్తలు రావడం మంచిదికాదు. దీనివల్ల అభివృద్ధికి ఆంటంకం ఏర్పడుతుంది. ప్రభుత్వపరంగా చులకనభావం ఏర్పడుతుంది.
- ప్రస్తుత జగన్ ప్రభుత్వం కూడా ఆంధ్రలో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందాలని కోరుకుంటుంది. అందుకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. నటీనటులకు స్థిరనివాసం, స్టూడియో ఏర్పాట్లకు సహకరిస్తామని మంత్రి పేర్నినాని, సి.ఎం. జగన్‌గారు కూడా ప్రోత్సాహాలు ప్రకటించారు. ఇలాంటి తరుణంలో ఇలాంటి తప్పుడు వార్తలు రావడం సినిమా అభివృద్ధికి ఆటంకమని తెలియజేశారు.
అనంతరం పలు ప్రశ్నలకు కె.ఎస్. రామారావుగారు బదులిస్తూ.. టికెట్ల రేట్ల విషయంలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంది. బడ్జెట్ ప్రకారం టికెట్ల పెంపు వంటి అంశాలు పరిశీలిస్తుంది. ఏది ఏమైనా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రలోనే సినిమా టికెట్లపై ప్రభుత్వం కలుగజేసుకోవడం వింత పోకడగా అభివర్ణించారు.