ఆ హీరోయిన్ బ్రహ్మచారిణిగా ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రేనట...

శుక్రవారం, 26 అక్టోబరు 2018 (18:52 IST)
మలయాళ బ్యూటీల్లో ఒకరు నయనతార. ఇపుడు లేడీ సూపర్ స్టార్‌గా కొనసాగుతున్నారు. అటు టాలీవుడ్‌లోనేకాకుండా, ఇటు తమిళం, మలయాళం, కన్నడ చిత్రసీమల్లో రాణిస్తోంది. అయితే, ఈమె ప్రేమాయణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 
 
కెరీర్‌ ప్రారంభంలో శింబుతో జతకట్టి పెళ్ళిదాకా వెళ్ళొచ్చింది. శింబుతో పెళ్ళి జరగకపోవడానికి రకరకాల కారణాలు వినిపించాయి. కానీ అప్పట్లో ఓ జ్యోతిష్కుడు చెప్పిన మాటలు ఇప్పుడు బాగా వైరల్‌ అవుతున్నాయి. నయనతార జాతకం బ్రహ్మాండంగా ఉందట. 
 
ఆమె పెళ్ళి చేసుకోకుండా బ్రహ్మచారిణిగా ఉండిపోతే తప్పకుండా ముఖ్యమంత్రి అవుతుందని ఆ జ్యోతిష్కుడు బల్లగుద్ది మరీ చెప్పాడట. ఆయన మాటలు వినే.. నయన ఇంత వరకూ పెళ్ళి చేసుకోలేదనీ సినీజనాలు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు