ఇళయరాజా 75.. కోర్టుకెక్కింది..

గురువారం, 31 జనవరి 2019 (14:49 IST)
దక్షిణ భారతదేశంలో మ్యాస్ట్రో ఇళయరాజా అంటే తెలియని సంగీత ప్రేమికులు ఉండరు. రాజా కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. 1000కు పైగా చలనచిత్రాలకు సంగీతాన్ని సమకూర్చాడు. ఇళయరాజా 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) గ్రాండ్‌గా ఈవెంట్‌ని ఏర్పాటు చేసి అతడిని సన్మానించాలని నిర్ణయించుకుంది. 
 
ఈ ఈవెంట్‌ని ఫిబ్రవరి 2, 3 తేదీల్లో చెన్నైలో నిర్వహించేందుకు సన్నాహాలను పూర్తి చేసారు, కాగా జేఎస్‌కే సతీష్ అనే నిర్మాత తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో అవకతవకలు జరిగినట్లు, దానిపై విచారణ చేపట్టాలని, అలాగే ఈ ఈవెంట్‌ని నిర్వహించకూడదంటూ హైకోర్టు మెట్లెక్కాడు. అంతే కాకుండా గత ఆర్థిక సంవత్సరాలలో కౌన్సిల్‌లో గోల్‌మాల్ జరిగినట్లు ఆరోపించాడు. 
 
మరోవైపు కౌన్సిలింగ్ బాడీలోని సభ్యులు అలాంటివి ఏమీ జరగలేదని, ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నాయి. బుధవారం నాడు వాదనలను విన్న న్యాయమూర్తి ఉత్తర్వులను రిజర్వ్ చేసారు. దీంతో ఇళయరాజా 75 కార్యక్రమంపై సందిగ్ధత నెలకొని ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు