ఛాన్సులు లేక సూసైడ్ ఆలోచనలో గోవా బ్యూటీ?!

ఆదివారం, 24 నవంబరు 2019 (13:59 IST)
గోవా బ్యూటీ ఇలియానా. ఒకపుడు తెలుగులోనే కాకుండా, దక్షిణాదితో పాటు.. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్. ఇపుడు ఏ భాషలోనూ అవకాశాలు లేవు. దీంతో తీవ్ర నిరాశలో కూరుకునిపోయింది. అందుకే ఆత్మహత్య చేసుకోవాలన్న తలంపులో ఉందనే వార్తలు గుప్పుమంటున్నాయి. 
 
అస‌లు ఇలియానాకు అంత ఆలోచ‌న రావ‌డానికి కార‌ణ‌మేంట‌నే దానిపై సోష‌ల్ మీడియాలో ప‌లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. "దేవ‌దాసు" చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన జ‌గ‌న సుంద‌రి ఇలియానా స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరింది. పెర్ఫామెన్స్‌, గ్లామ‌ర్‌తో ఆక‌ట్ట‌కున్న ఈ జ‌గ‌న‌సుంద‌రి హ‌య్య‌స్ట్ రెమ్యున‌రేష‌న్ హీరోయిన్ రేంజ్‌ను ట‌చ్ చేసింది. 
 
అయితే టాలీవుడ్‌లో ఈమె కెరీర్ పీక్స్‌లో ఉండ‌గా బాలీవుడ్‌వైపు అడుగులేసింది. బాలీవుడ్‌లోకి వెళితే వెళ్లింది కానీ.. అక్క‌డ అడ‌పా ద‌డ‌పా మాత్ర‌మే సినిమాలు చేసింది. తెలుగు సినిమాల‌ను ప‌ట్టించుకోలేదు. కేవ‌లం బాలీవుడ్ సినిమాల‌నే చేస్తానంటూ భీష్మించుకుంది. అదేస‌మ‌యంలో విదేశీ ఫొటోగ్రాఫ‌ర్ అండ్రూతో ప్రేమ‌లో ప‌డింది.
 
వ‌ల‌పు పాఠాల‌తో బిజీగా మారిపోవ‌డంతో బాలీవుడ్ కూడా ఈమెను పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో బాలీవుడ్‌లోనూ అవ‌కాశాలు రాలేదు. టాలీవుడ్ వైపు అవ‌కాశాలు కోసం చూసింది. ర‌వితేజ‌తో ఈమె చేసిన 'అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని' కూడా ప్లాప్ కావ‌డంతో దారుల‌న్నీ మూసుకుపోయింది. అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో డిప్రెష‌న్‌లోకి వెళ్లింద‌ట‌. 
 
త‌రచూ నిద్ర‌మాత్ర‌లు తీసుకోవ‌డం, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్ట‌క‌పోవ‌డంతో బాగా లావైంద‌ట‌. ఆ స‌మ‌యంలో ఏం చేయాలో తెలియ‌క ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకుంద‌ట‌. అయితే చివ‌ర‌కు మ‌ళ్లీ కెరీర్‌లో రాణించాల‌ని ఫోకస్ చేసి బ‌రువు త‌గ్గింద‌ట‌. ఇప్పుడు ఇలియానా న‌టించిన తాజా బాలీవుడ్ చిత్రం "పాగ‌ల్ పంతి" ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌ళ్లీ ఇల్లీ బేబి బాలీవుడ్‌లో బిజీ అవుతుందేమో వేచి చూడాలి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు