ప్రేర‌ణ వేటూరి, అనుభ‌వం రాజ‌మౌళి, సుకుమార్‌, మ‌ణిశ‌ర్మ: బండారు దానయ్య

బుధవారం, 27 జనవరి 2021 (18:26 IST)
Inspriation Veturi, danayya
గురువుగారు వేటూరి సుంద‌ర‌రామ్మూర్తి గురుంచి మీ అందరికీ  ఎంత చెప్పినా తక్కువే అందుకే వారి గురించి నా మాటల్లో తెలియజేయాలని చెప్తున్నా.. `ఎత్తైన వృక్షాలు ఎన్ని ఉన్నా, గాలిని ప్రసవించగా - వెదురు మాత్రమే వేణువైంది, కలము లెన్నో పుట్టి కళలు కన్నా..  కారణజన్ముడు జన్మ ఒక్కటే కావ్య మైంది. అతనెవరో కాదమ్మా ,కృష్ణా గోదారి పుణ్య నదుల పుత్రోత్సాహం వేటూరి.

వేటూరి రాయగా పాటలెన్నయా నన్నయా మా సుందర మూర్తిని పొగడగ కవి కులం పులకిస్తుందయ్యా కన్నయ్య`.. త‌న గురుభ‌క్తిని చాటుకున్నారు గీత‌ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు బండారు దాన‌య్య‌. సినిమా రంగంలో ఎన్నో ఆటోపోటులు చ‌విచూసిన త‌న‌కు అవే ద‌ర్శ‌కుడు అయ్యేందుకు సోపానాల‌య్యాయ‌ని అంటున్నారు. క‌వినుంచి ద‌ర్శ‌కుడిగా మారి ఆయ‌న తీసిన చిత్రం `చిత్ర‌ప‌టం`. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ సినిమా గురించి ఆయ‌న చెప్పిన విశేషాలు.
 
నరేన్ ,పోసాని కృష్ణ మురళి, శరణ్య పొన్ననన్, బాలాచారి, నూకరాజు, శ్రీ వల్లి నటీనటులుగా శ్రీ క్రియేషన్ పతాకంపై బండారు దానయ్య కవి దర్శకత్వంలో పుప్పాల శ్రీధర్ రావు నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం "చిత్రపటం" .ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న సందర్భంగా చిత్ర దర్శకుడు పాత్రికేయులతో ముచ్చటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
 
- నల్గొండ లో డిగ్రీ వరకూ చదివిన నేను సినిమాలలో  పాటలు రాయాలనే కోరికతో  ఇక్కడ కొచ్చి పాటలు రాసే ప్రక్రియలో  జరిగిన సంఘటనలతో ఈ చదువు సరిపోదని తెలుసుకొని తెలుగు మీడియం పై ఉన్న ఇష్టంతో ఉస్మానియాలో తెలుగు ఎం ఎ చేశాను.
 
- గురువుగారు వేటూరి సుందర రామ్మూర్తి గారి  ప్రేర‌ణ‌తో ఇండస్ట్రీలో అవకాశాలు వెతుక్కుంటూ మరోపక్క చదువుకుంటూనే కొన్ని పాటలు రాశాక మొదటిసారిగా నాకు దర్శక,నిర్మాత దొంతి రెడ్డి అచ్యుత్ రెడ్డి గారు నిర్మించిన "నువ్వుంటే చాలు" చిత్రానికి  అవకాశం కల్పించారు.2000 వచ్చిన ఇదే నా  మొదటి సినిమా. ఈ సినిమా తో నాకు మంచి పేరువచ్చింది. తొలిచూపులోనే, దొంగోడు, అతనొక్కడే మహానంది, ఎవడి గోల వాడిదే, అసాధ్యుడు, వీర`, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, ఈ సినిమాలకు పాటలు రాసే అవకాశం కలిగింది.
 
- మణిశర్మ, కీరవాణి, దేవిశ్రీ, సుకుమార్, రాజమౌళి దగ్గర లిరిసిస్ట్ గా చేసి అనుభవం సంపాదించుకున్నాను. నేను ఎక్కువగా శిష్యరికం వేటూరి సుందర మూర్తి గారి దగ్గరే చేయడం జరిగింది. ఆ గురువు గారి దగ్గర నేను ఏంతో నేర్చుకొన్నాను.నేను రైటర్'గా లైఫ్ మెంబర్షిప్ తీసుకోన్నా వారి సంతకం తోనే తీసుకోవడం జరిగింది.ఈ రోజు నేను ఇంతవాడిని అయ్యానంటే అదంతా వారి ఆశీస్సులే, అలా వారి ఆశీస్సులే వల్లే నేను ఇంతవాడిని అయ్యాను. వారి ఋణం తీర్చుకోలేనిది.
 
- ఆ తరువాత  పాటలు రాసిన అనుభవంతో నేను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే అవకాశం కలిగింది.  బావ మరదళ్లు, సతీ తిమ్మమాంబ,చిన్నపిల్లల సినిమా జీనియస్, పాష అందరివాడులాంటి మొదలగు  సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా చేయడం జరిగింది.ఇందులో చిన్నపిల్లల సినిమా జీనియస్ కు రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రశంశలు కూడా అందుకొని నాకు మంచి పేరు తీసుకొచ్చాయి.
 
- ఆ సినిమాల అనుభవంతో డాటరాఫ్ బుచ్చిరెడ్డి అనే సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం  రావడం జరిగింది.ఆ సినిమాకు డైరెక్షన్ చేస్తూ మ్యూజిక్ కూడా నేనె అందించడం జరిగింది. ఈ సినిమా ప్రసాద్ ల్యాబ్ లో పోస్ట్,ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటూ విడుదలకు సిద్దంగా ఉంది.కరోనా రావడం వలన ఆ సినిమా లేట్ అవడం జరిగింది.తర్వాత వస్తున్న నా రెండో సినిమానే "చిత్రపటం".
 
-మనందరం ఏవైనా చేసుకోవాలన్న,తినాలన్న ఇంటర్నెట్ పై ఆధారపడి ఉన్నాము. అయితే  సెల్ ఫోన్ లో గూగుల్ లోగాని,ఇంటర్నెట్ లోగాని,  ఇంట్లో గానీ, మన కుటుంబం లోనే, మన మనసులో, మన స్పర్శలో, మన చుట్టూ ఉన్నా మనందరం దాన్ని వెతుక్కోలేకపోతున్నాం అదే ఎమోషన్. ఆ ఎమోషన్ కంటెంట్ తోనే ఈ సినిమా తీయడం జరిగింది. ఇది పొయేటిక్ టచ్ తో వస్తున్న కమర్షియల్ సినిమా అలాగని ఇది పూర్తి పోయేటిక్ సినిమా కాదు ఇందులో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి.

నాకు ఎమోషన్ అంటే ఇష్టంఈ సినిమాలో కామెడీ,వల్గారిటీ ఉండదు.తండ్రి,కూతురు మధ్య అల్టిమేట్  ఎమోషన్ కంటెంట్ తో ఈ "చిత్రపటం" మూవీ చేయడం జరిగింది.ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది త్వరలోనే ఆడియో విడుదల జరుపుకుని సినిమాను విడుదల చేస్తామని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు