ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ లుక్ ఇదేనా?

గురువారం, 18 జనవరి 2018 (10:24 IST)
స్వర్గీయ ఎన్.టి.రామారావు 22వ వర్థంతి వేడుకలు గురువారం జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్స్‌కు నందమూరి కుటుంబ సభ్యులతో పాటు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి వెళ్లి నివాళులు అర్పించారు. 
 
ఈ సందర్భంగా సినీ నటుడు బాలకృష్ణ స్పందిస్తూ, మహానుభావుడు ఎన్టీఆర్ బయోపిక్‌ చిత్రీకరణను మార్చిలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. తెలుగువారి గుండెచప్పుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహనీయుడు ఎన్టీఆర్‌కు భారతరత్న కోసం కృషిచేస్తానని తెలిపారు. 
 
ఎన్టీఆర్‌ జీవితంలో బయటకు తెలియని కోణాలు అనేకం ఉన్నాయన్నారు. బయోపిక్‌ ద్వారా ఎన్టీఆర్ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని తెలిపారు. దేశం గర్వించేలా ఎన్టీఆర్‌ బయోపిక్‌ నిర్మిస్తామని బాలకృష్ణ అన్నారు.
 
కాగా, ఎన్టీఆర్ వర్థంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ లుక్ ఇదేనంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు