'సైరా'లో పాండురంగ హీరోయిన్.. ఒప్పించే ప్రయత్నాల్లో చరణ్

శనివారం, 1 సెప్టెంబరు 2018 (17:53 IST)
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఈ చిత్రాన్ని హీరో రామ్ చరణ్ స్వయంగా తెరకెక్కిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. భారతదేశ తొలి స్వాతంత్ర్య సమరయోధుడు సైరా నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
 
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో అమితాబ్, నయనతార, సుదీప్, విజయ్ సేతుపతి వంటివారు కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాలో 'టబూ' కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించనున్నట్టుగా ఒక వార్త వినిపిస్తోంది.
 
ఇంకా టబూతో సంప్రదింపులు జరుగుతున్నాయనేది తాజా సమాచారం. చరణ్ .. దర్శకుడు సురేందర్ రెడ్డి ఆమెను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. టబూ ఓకే అంటే త్వరలోనే ఆమె ఈ సినిమా షూటింగులో పాల్గొనే అవకాశం ఉందని చెబుతున్నారు.
 
తెలుగులో హీరో బాలకృష్ణతో చేసిన 'పాండురంగడు' ఆమె చివరి చిత్రం. టబూ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే .. 'పాండురంగడు' తర్వాత ఆమె చేసే సినిమా ఇదే అవుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు