ఛార్మికి థ్యాంక్స్ చెప్పిన భాస్కరభట్ల... ఎందుకో తెలుసా?

గురువారం, 20 జూన్ 2019 (18:52 IST)
ఇస్మార్ట్ శంక‌ర్ టైటిల్ సాంగ్ ఆత్రంగా ఎదురు చూస్తున్నాను. రాసింది నేనే అయినా... రికార్డింగ్ ద‌గ్గ‌ర ఉన్నా.. ఫైనల్ అవుట్‌పుట్ ఎలా ఉంటుందా అనే ఎగ్జైట్మెంట్లో ఉన్నాను అని తెలియ‌చేసారు గీత ర‌చ‌యిత భాస్క‌ర‌భ‌ట్ల. ఎన‌ర్జిటిక్ హీరో రామ్ - డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఇస్మార్ట్ శంక‌ర్. ఈ సినిమా ప్ర‌స్తుతం పాటల చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. 
 
ఈ మూవీ టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేసారు. ఈ సంద‌ర్భంగా గీత ర‌చ‌యిత భాస్క‌ర‌భ‌ట్ల స్పందిస్తూ... ఈ మూవీ టైటిల్ సాంగ్‌ను అనురాగ్ కుల‌క‌ర్ణి పాడారు. మ‌ణిశ‌ర్మ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో.. ఓల్డ్ సిటీ నేప‌ధ్యంలో వ‌స్తున్న సినిమా కాబ‌ట్టి హీరో ఇంట్ర‌డ‌క్స‌న్ సాంగ్ ఇది. అక్క‌డ భాష ఎలా ఉంటుంది. మాట‌లు ఎలా ఉంటాయి అనేది ప‌రిశీలించి ఈ పాట రాయ‌డం జ‌రిగింది. ఇప్పుడు వ‌స్తున్న హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్స్ కంటే చాలా డిఫ‌రెంట్‌గా ఈ సాంగ్ ఉంటుంది. 
 
ఈ పాట రాస్తూ చాలా కొత్త కొత్త ప‌దాల గురించి తెలుసుకున్నాను. హీరో యాటిట్యూడ్ పూర్తిగా క‌న‌ప‌డే సాంగ్ ఇది. ఇప్ప‌టివ‌ర‌కు తెలుగు సినిమాల్లో వ‌చ్చిన‌ హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్స్‌లో ఈ పాట చిర‌స్ధాయిగా నిలిచేపోయేలా ఉంటుంది. కంటెంట్ బ‌లంగా ఉంది ఈ పాట‌లో. పూరి గారు క‌థ చెప్పిన‌ప్పుడు ఈ పాట‌లో ఇవి కావాలి అని చెప్ప‌డంతో చాలా ఎగ్జైట్ అయి రాసాను. 
 
పూరి గారితో నాకు ఇది 27వ సినిమా. ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌మ‌ణ్యం సినిమా ద‌గ్గ‌ర నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 27 సినిమాల‌కు కంటిన్యూగా రాసాను. మంచి ట్యూన్ ఇచ్చిన మ‌ణిశ‌ర్మ గార్కి, అలాగే పాట‌ను బాగా మెచ్చుకున్న హీరో రామ్ గార్కి, పాట విన్న వెంట‌నే బ్లాక్ బ‌ష్ట‌ర్ అవుతుంద‌ని చెప్పిన ఛార్మి గార్కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. మా యూనిట్ అంతా ఈ పాట‌కు ఫ్యాన్సు. పాట రాసింది నేనే అయినా ఈ పాట‌కు నేను కూడా ఫ్యాన్‌ని. త‌ప్ప‌కుండా అంద‌రికీ ఈ పాట న‌చ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు