అనసూయపై సెటైర్ కాస్త రష్మీపై పేలింది.. నాగబాబే ఆ పని చేశారు.. (Video)

శుక్రవారం, 15 నవంబరు 2019 (11:44 IST)
జబర్దస్త్ కామెడీ షో లేటెస్ట్ ప్రోమో తాజాగా విడుదలైంది. వచ్చేవారం ప్రసారమయ్యే ఈ ఎపిసోడ్‌లో రాకెట్ రాఘవ తన స్కిట్‌తో అదరగొట్టాడు. సౌండ్ వినబడితే చాలు స్టెప్పులు వేయడం ఈ స్కిట్‌లో రాకెట్ రాఘవకు ఉన్న వీక్‌నెస్. స్కిట్‌ ప్రారంభంలో తన 'వీకెనెస్' గురించి చెబుతూ.. పనిలో పనిగా జబర్దస్త్ యాంకర్, జడ్జిలపై కూడా రాఘవ సెటైర్స్ వేశాడు.
 
'ఏ చిన్న జోక్ వేసినా పగలబడి నవ్వడం నాగబాబు వీక్‌నెస్, గ్లామరస్‌గా నవ్వడం రోజా గారి వీక్‌నెస్, 'అర్థం కాకపోయినా నవ్వడం అనసూయ వీక్‌నెస్' అంటూ సెటైర్స్ వేశాడు. అయితే చివరలో అనసూయ వేయబోయిన సెటైర్ కాస్త రష్మీపై పేలింది. అర్థం కాకపోయినా నవ్వడం అనసూయ వీక్‌నెస్ అని రాఘవ అనగానే... 'కాదు అది రష్మీ వీక్‌నెస్' అంటూ నాగబాబు పంచ్ వేశాడు. తాజాగా ఆ ప్రోమోను మీరూ ఓ లుక్కేయండి.. 
 
ఇకపోతే, రష్మీ గౌతమ్ తెలుగు టీవీ తెరపై కనిపిస్తూ తన అందచందాలతో కవ్విస్తూ యూత్‌లో అదిరిపోయే క్రేజ్‌ను సంపాదించుకుంది. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూనే అవకాశం వచ్చినప్పుడల్లా సినిమాలు చేస్తూ ఉంటుంది. రష్మీ మరో కోణం సామాజిక అంశాలపై స్పందించడం చేస్తుంటుంది. తాజాగా రష్మీ హాట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు