జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి మ‌ర‌ణం న‌న్నెంతో బాధించింది: డా.మంచు మోహ‌న్ బాబు

మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (12:19 IST)
ప్రముఖ సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి మరణవార్త నన్ను ఎంతగానో బాధించింది. మా లక్ష్మీ పిక్చర్స్ బ్యానర్ ఎన్నో మంచి పాత్రలు చేశారు. నటుడిగా జయప్రకాష్ రెడ్డి బిజీగా ఉన్నప్పటికీ తనకు ఎంతో ఇష్టమైన నాటక రంగాన్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ నాటకాల్లో పాత్రలు పోషిస్తూ ఉండేవారు. 
 
పదిమందికి సహాయం చెయ్యాలనే వ్యక్తి తను. జయప్రకాష్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని శిరిడి సాయినాధున్ని కోరుకుంటున్నాను వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని డాక్టర్ మంచు మోహన్ తెలిపారు. 
 
ఎన్నో మంచి పాత్రలతో మెప్పించిన విలక్షణ నటుడు జయప్రకాష్ రెడ్డి గారి మృతి విచారకరం, పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను... అని నందమూరి బాలకృష్ణ వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు