నటుడిగా చిరంజీవిని అభిమానిస్తాం.. ఆ ఇష్యూలో మెగా ఫ్యాన్సే అతి చెశారు : జీవితా రాజశేఖర్

శుక్రవారం, 23 డిశెంబరు 2016 (12:19 IST)
గత 2009 ఎన్నికల్లో మెగాస్టార్‌ చిరంజీవితో ఢీ అంటే ఢీ అని పోరాడారు దంపతులైన సినీ హీరోహీరోయిన్లు జీవిత, రాజశేఖర్‌ దంపతులు. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని జీవితా రాజశేఖర్ బహిర్గతం చేశారు. 'ఓ సినిమా నటుడిగా చిరంజీవిని అభిమానిస్తా. కానీ, ఆయనకు పొలిటికల్‌గా అనుభవం లేదు. అందుకే నేను వేరే పార్టీకి సపోర్ట్‌ చేస్తాన'ని రాజశేఖర్‌ చెప్పారు. 
 
దాన్ని అక్కడితో వదిలేసి ఉంటే బాగుండేది. కానీ, చిరంజీవి గారి ఫ్యాన్స్‌ మామీద దాడి చేసి ఆ ఇష్యూని పెద్దది చేశారు. దానికి కొనసాగింపుగానే మేం రాజకీయాల్లో చేరి చిరంజీవికి వ్యతిరేకంగా పనిచేశాం. తీరా ఎన్నికలు అయిపోయాక చిరంజీవి పార్టీ కాంగ్రెస్‌లో కలిసిపోయింది. అపుడే రాజకీయాలంటే ఏంటో నాకు అర్థమైంది. అందుకే కాంగ్రెస్‌ నుంచి బయటికొచ్చినట్టు తెలిపారు. 
 
ప్రస్తుతం చిరంజీవితో సంబంధం బాగానే ఉంది. ఇప్పుడు నేను బీజేపీలో ఉన్నాను. పెద్దనోట్లు రద్దు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాన్ని అందరూ తప్పుబడుతున్నారు. కానీ, మోడీ తీసుకున్న నిర్ణయం దేశానికి మంచిదే. చిన్న చిన్న తప్పులున్నా దాని వల్ల దేశానికి మేలు జరుగుతుంది. నిజమైన పేదవాళ్లు బాగానే ఉన్నారు. బ్యాంక్‌ల ఎదుట క్యూలో నిల్చున్నవారిలో చాలామంది నల్లదొంగల నుంచి కమీషన్‌ తీసుకుని వచ్చినవారేన'ని జీవిత సెలవిచ్చారు. 

వెబ్దునియా పై చదవండి