ఏలే... వేంగయ్యన్ కొడుకుని.. దమ్ముంటే మొత్తంగా రండిరా... కాలా తమిళ టీజర్

శుక్రవారం, 2 మార్చి 2018 (10:25 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం "కాలా". ఈ చిత్రం టీజర్‌ను రిలీజ్ చేశారు. రజనీకాంత్ అల్లుడు, తమిళ హీరో ధనుష్ వండర్‌ బార్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. 
 
ఈ టీజ‌ర్‌లో ర‌జ‌నీ స్టైల్‌, డైలాగులు, యాక్ష‌న్ సీన్లు అదిరిపోయేలా ఉన్నాయి. ఈ చిత్రంలో రజనీ.. కరికాలన్‌ అనే డాన్‌ పాత్రలో నటించారు. వండర్‌ బార్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై ధనుష్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పా.రంజిత్‌ దర్శకత్వం వహించారు. ఈ టీజర్ గురువార‌మే విడుదల కావాల్సి ఉండ‌గా.. కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి పరమపదించిన నేపథ్యంలో తొలుత వాయిదా వేసి ఆ తర్వాత రిలీజ్ చేశారు. 
 
"కాలా" చిత్రీకరణ ఎక్కువ భాగం ముంబైలో జరిగింది. ఇందులో బాలీవుడ్‌ నటి హుమా ఖురేషీ రజనీకి జోడీగా నటించారు. నానా పటేకర్‌ ప్రతినాయకుడి పాత్రలో నటించారు. ఏప్రిల్‌లో ఈ సినిమా విడుదల కాబోతోంది. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు