తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ ఫిలిమ్ కబాలి రిలీజ్‌పై ప్రపంచ వ్యాప్తంగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్లు పోటీపడుతున్నారు. ఈ సినిమా హక్కుల్ని రూ.32 కోట్ల మేర తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇంకా ఫైనల్ కాలేదు. తాజాగా కొత్త పార్టీ కబాలి రైట్స్ కోసం రంగంలో దిగుతున్నట్లు తెలిసింది.
పశ్చిమ గోదావరికి చెందిన షణ్ముఖ సంస్థ ప్రస్తుతం ఈ సినిమా రైట్స్‌ను తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ సంస్థ ఇప్పటి వరకు పశ్చిమంలోనే సినిమా డిస్ట్రిబ్యూషన్ చేస్తూ వచ్చింది. సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి సినిమాకు కూడా లాభాలు చేసుకున్న సంస్థగా గుర్తింపు వచ్చింది. అలాగే నాన్నకు ప్రేమతో సినిమాకు కూడా మంచి కలెక్షన్లు సాధించారు. అదే ఉత్సాహంతో రాష్ట్ర వ్యాప్తంగా కబాలి డిస్ట్రిబ్యూషన్‌లోకి దిగాలని డిసైడ్ అయ్యింది. రేటు మాత్రం కాస్త తగ్గే ఛాన్సుందని తెలుస్తోంది.