S థమన్ అద్భుతమైన ఆర్‌కె.స్ట్రాతో చక్కటి ఫీల్‌ను కలిగించేలా బాణీలు సమకూర్చాడు. సిద్ శ్రీరామ్ తన మధురమైన గానంతో పాటకు ప్రాణం పోశాడు. అనంత శ్రీరామ్ ఆకట్టుకునే సాహిత్యం సమకూర్చారు. మహేష్ బాబు తన స్టైలిష్ లుక్స్, ఆకట్టుకునే హావభావాలతో అందరినీ ఆశ్చర్యపరిచారు, కీర్తి సురేష్ ఇందులో చాలా అందంగా కనిపించింది.
మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఆర్ మధి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్.