మిస్టర్ ఉద్ధవ్ ఠాక్రే.. ఎన్ని గొంతులను మీరు నొక్కిపెట్టగలరు : కంగనా రనౌత్

గురువారం, 10 సెప్టెంబరు 2020 (12:56 IST)
హిందీ చిత్రపరిశ్రమకు చెందిన సీనియర్ నటి కంగనా రనౌత్‌కు, మహారాష్ట్రలోని అధికార శివసేన పార్టీకి మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతోంది. బుధవారం హర్యానా రాష్ట్రం నుంచి ముంబైకి చేరుకునే లోపే మహారాష్ట్ర సర్కారు ఒత్తిడిమేరకు బీఎంసీ అధికారులు మణికర్ణిక కార్యాలయాన్ని కూల్చివేశారు. ఈ చర్యపై కంగనా అగ్గి మీద గుగ్గిలమయ్యారు. ఆ తర్వాత శివసేనపై, ఉద్ధవ్‌ ఠాక్రేలపై వరుస ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. 
 
గురువారం కూడా మరోమారు సీఎం ఉద్ధవ్‌ను లక్ష్యంగా చేసుకుని కంగనా విమర్శల తూటాలు పేల్చారు. 'మీ తండ్రి చేసిన మంచి పనులు మీకు సంపదనిచ్చాయి.. కానీ మీ గౌరవం మీరే సంపాదించుకోవాలి. మీరు నా నోరు మూయించగలరు, కానీ నా గొంతు వంద మిలియన్లలో ప్రతిధ్వనిస్తుంది. ఎంత మంది నోర్లు మీరు మూయించగలరు? ఎన్ని గొంతులను మీరు నొక్కిపెట్టగలరు? మీరు ఎప్పుడైతే నిజం నుంచి తప్పించుకోవాలని చూస్తారో.. మీరు రాజవంశానికి నమూనాగా మిగిలిపోతారు తప్ప ఇంకేమీ కారు' అని ఉద్ధవ్ ఠాక్రేను ఉద్దేశించి కంగనా ట్వీట్ చేశారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు