సూర్య కెరీర్‌లో కంగువా అతిపెద్ద కుంగగొట్టు సినిమానా? తమిళ తంబీలు ఏకేస్తున్నారు

ఐవీఆర్

శుక్రవారం, 15 నవంబరు 2024 (15:34 IST)
సూర్య హీరోగా భారీ అంచనాలతో విడుదలైన చిత్రం కంగువా. ఈ చిత్రం సుమారు రూ. 350 కోట్లతో తెరకెక్కింది. ఐతే సినిమా విడుదలకు ముందున్న హైప్ కాస్తా తుస్సుమంటూ గాలి తీసేసినట్లయ్యింది. సోషల్ మీడియాలో చిత్ర దర్శకుడు శివను తమిళ తంబీలు #SiruthaiSiva అంటూ ఏకేస్తున్నారు. సూర్య కెరీర్లో అత్యంత చెత్త సినిమా అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కలెక్షన్ల పరంగా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా కేవలం రూ. 40 కోట్లను రాబట్టగలిగింది.
 
సినిమా మొదటి రోజు మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు కేవలం రూ. 6.40 కోట్లుగా వుంది. ఇక సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్లను చూస్తే... తమిళనాడు రూ. 11.45 కోట్లు, తెలుగు రాష్ట్రాలు రూ. 6.40 కోట్లు, కర్నాటక రూ. 2.30 కోట్లు, కేరళ రూ. 3.90 కోట్లు, హిందీ(ఇతర ప్రాంతాలు కలిపి) రూ. 4.75 కోట్లు, ఓవర్సీస్ రూ. 11.40 కోట్లు సుమారుగా, ప్రపంచ వ్యాప్తంగా రూ. 40.20 కోట్లు(సుమారుగా). అంటే... ఇంకా రూ. 310 కోట్ల ఈ చిత్రం రాబట్టాల్సి వుంది. కానీ ఇంతలోనే చిత్రంపై భారీ ఎత్తున ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు