వైవాహిక అత్యాచారాలపై నోరు విప్పాలి.. అబలలం కాదని నిరూపించాలి: కత్రినా కైఫ్

బుధవారం, 7 డిశెంబరు 2016 (11:48 IST)
బాలీవుడ్‌లో ప్రేమ జంటలు బ్రేకప్ కావడం, పెళ్ళయిన జంటలు విడాకులతో విడిపోవడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ అందాల తార, మల్లీశ్వరి హీరోయిన్ కత్రినా కైఫ్ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై గళం విప్పారు. తమపై జరుగుతున్న వైవాహిక అత్యాచారాలు, ఇతర హింసలపై మహిళలు నోరు విప్పాల్సిన అవసరం ఉందన్నారు.
 
మహిళలు ధైర్యంగా తమకు జరుగుతున్న అన్యాయాన్ని బయటకు చెప్పినప్పుడే న్యాయం జరుగుతుందన్నారు. చదువుకున్న మహిళలు సైతం కొన్నిసార్లు సామాజిక కట్టుబాట్ల కారణంగా మౌనంగా ఉంటున్నారని కత్రినా కైఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా గుర్తించడంలో సమాజం విఫలమైందని కత్రినా కైఫ్ పేర్కొన్నారు. ఇప్పటికైనా మహిళలు ధైర్యంగా ముందుకు రావాలని, తాము అబలలం కాదని నిరూపించాలని కత్రినా కైఫ్ పిలుపునిచ్చారు.

వెబ్దునియా పై చదవండి