రాజమౌళి సినిమాకు ఆయన కుటుంబీకులు పనిచేయడం పరిపాటే. ఏ హీరోకయినా వారుండాల్సిందే. మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుగుతోంది. ఒరిస్సాఅడవులలో జరుగుతోంది. అనంతరం హైదరాబాద్ తోపాటు పలు చోట్ల షూటింగ్ జరగనుంది. కాగా, ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన విలన్ గా నటిస్తున్నారని తెలుస్తోంది.