Parthiban : నటి సీత నాకు లైఫ్ ఇచ్చిందంటున్న పార్తీబన్, తెలుగులో రీ ఎంట్రీ

దేవీ

మంగళవారం, 18 మార్చి 2025 (17:52 IST)
Parthiban
తెలుగు ప్రేక్షకులకు చాలా గేప్ ఇచ్చిన తమిళ నటుడు పార్తీబన్ ఇప్పుడు అతని మాజీ భార్య సీత గురించి చేసిన వ్యాఖ్యలతో మరింతగా పాపులర్ అయ్యాడు. ఈ సందర్భంగా తెలుగు ఛానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో పలు విషయాలు వెల్లడించారు.  తన కెరీర్ ఆరంభంలో దర్శకుడు అవ్వాలని ఓ కథను తీసుకుని ప్రముఖ హీరోలను సంప్రదించాను. అందులో కమల్ హాసన్ కూడా వున్నారు. అగ్ర నిర్మాతలకూ చెప్పాను. అందరూ మూడు సీన్స్ విన్నాక ఇది వర్కవుట్ కాదని అనేవారు. ఎందుకంటే సినిమా అంటే ఇలానే వుండాలనే రూల్ ను  వారు అప్పట్లో పెట్టుకున్నారు. 
 
చాలా కష్టపడుతూ, ఏమి చేయాలో అని ఆలోచిస్తూన్న టైంలో నిర్మాత సుందరంగారు నాకు సపోర్ట్ చేయడంతో నాకు ఆయన దేవుడిలా అనిపించారు. దర్శకత్వం చేయాలనే ఆలోచనగల నాకు హీరోగా ఎవ్వరూరాకపోతే నేనేచేశాను. 1988లో 38 లక్షలతో సినిమా తీశాం. ఆ ఆ తర్వాత అది విడుదలయి సూపర్ డూపర్ హిట్ అయింది. రెండు నేషనల్ అవార్డులు కూడా వచ్చాయి అనితెలిపారు. ఆ సినిమా టైంలో  నేను పెద్దగా తెలియదు. అందుకే సీతను హీరోయిన్ గా ఎంపిక చేశాం. మార్కెటింగ్ పరంగా సీత ఫొటోను ఉపయోగించుకున్నాం. ఎందుకంటే అది లేడీ ఓరియెంటెడ్ సినిమా. అలా సీత వల్ల లైఫ్ వచ్చిన నాకు కాలక్రమంలో ఆమెనుపెండ్లి చేసుకోవడం జరిగింది అంటూ వివరించారు.
 
 ఈ సినిమాలో హీరో పాత్రలో రెండు షేడ్స్ వుంటాయి. మొదటి భాగం నెగెటివ్, రెండోది పాజిటివ్ గావుంటుంది. బహుశా హీరోలకు నచ్చలేదని తర్వాత అర్థమైంది. పైగా కథంతా హీరోయిన్ మీద సాగుతుంది. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ. ఈ కథను ముందుగా సీత తండ్రికి చెప్పగానే ఆయన అంగీకరించారు. అలా సీత నాయికగా ఎంపికయింది అన్నారు.
 
 పార్తీబన్ తండ్రి తెలుగువారే. అమ్మ కొచ్చి. ఇంట్లో తెలుగు మాట్లాడుకునేవాళ్ళం. అలా వచ్చీరానీ తెలుగు మాట్లాడుకుంటూ తెలుగులోనే నేను మాట్లాడుతున్నాను. అన్నారు.
 
పొన్నియన్ సెల్వన్ సినిమా చేశాక నాకు తెలుగులో పెద్ద ఆఫర్ వచ్చింది.  త్వరలో అగ్ర హీరో సినిమాలో తెలుగులో నటించబోతున్నట్లు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు