శాండల్‌వుడ్ నటుడు, కేజీఎఫ్ యాక్టర్ మోహన్ జునేజా ఇక లేరు. ఇటీవల విడుదలైన కేజీఎఫ్ చాప్టర్ 2 లో నటించిన ఆయన అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు.
మోహన్ జునేజా కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో హాస్యనటుడిగా నటించి మెప్పించారు. దాదాపుగా 100 సినిమాల్లో ఆయన నటించారు. మోహన్ జునేజా మృతి పట్ల అభిమానులు శాండల్‌వుడ్ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.