చిరంజీవిపై వున్న అభిమానాన్ని ఒక్కసారిగా ప్రేక్షకులు బయటపెట్టి చిత్ర విజయానికి దోహదపడ్డారని.. నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. చిరంజీవి నటించిన 'ఖైదీ నెం.150' విజయాన్ని గురించి బుధవారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడారు. విడుదలైన అన్ని సెంటర్లలోనూ బాగా ఆడుతోంది. ఈ రోజుకూ హౌస్‌ఫుల్‌తో ఆడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 76 కోట్లు వసూలు చేసింది. టాలీవుడ్‌లో 100 కోట్లను క్రాస్ చేసిందని పేర్కొన్నారు.
కలెక్షన్ల వివరాలు తెలుపుతూ కర్నాటకలో రూ. 9 కోట్లు, నార్త్ ఇండియా రూ.1.3 కోట్లు.. నార్త్ అమెరికా రూ.17 కోట్లు.. మిగిలిన ప్రాంతాల్లో రూ.3.99 కోట్లు.. ఒరిస్సా రూ.40 లక్షలు, తమిళనాడు రూ.60 లక్షలు.. మొత్తం 108.48 కోట్లు వసూలయిందని తెలిపారు. ఇంకా భారీ వసూళ్ళను రాబట్టనుందనీ, ఈ వారంలోనే ఫ్యాన్స్‌తో కలిసి చిత్ర యూనిట్ పాలుపంచుకోనున్నదని అప్పుడు చిరంజీవిగారు వస్తారని తెలిపారు.
వినాయక్ మాట్లాడుతూ... అన్నయ్య 150 చిత్రానికి ఇంతటి భారీ రెస్పాన్స్ ఊహించలేదు. ఎక్కడ చూసినా విపరీతంగా అభిమానాన్ని చూపిస్తున్నారు. చాగల్లు లాంటి గ్రామంలో సినిమా 5 లక్షలు వసూలు చేయడం గ్రేట్.. అలాంటి చోట్ల 7 కోట్లు, వైజాగ్‌లో 17 కోట్ల షేర్ వచ్చింది. చిరంజీవి స్టామినా తగ్గలేదనేందుకు ఇదొక నిదర్శనమని పేర్కొన్నారు. నైజాంలో అన్యాయం జరిగిందని వార్తలు వస్తున్నాయి. కలెక్షన్ల బట్టి మీరే ఊహించుకోండనీ.. ఎలాంటి నెగెటివ్ ఆలోచనలు పెట్టుకోవద్దని వారికి సూచించారు.