రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

దేవీ

మంగళవారం, 18 మార్చి 2025 (18:13 IST)
James Wat Kommu, Santosh Kalvacherla, Krisheka Patel
సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జంటగా నటిస్తున్న సినిమా "కిల్లర్ ఆర్టిస్ట్". ఈ సినిమాను ఎస్ జేకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మిస్తున్నారు. రతన్ రిషి దర్శకత్వం వహిస్తున్నారు. "కిల్లర్ ఆర్టిస్ట్" మూవీ ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. నైజాం ఏరియాలో ఈ సినిమాను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేస్తుండటం విశేషం. ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.
 
ప్రొడ్యూసర్ మాట్లాడుతూ - చిత్రీకరణ చేస్తున్నంత వరకు సినిమా బాగా రావాలని ప్రయత్నించాం. హీరో సంతోష్ , హీరోయిన్ క్రిషేక, సోనియా..వీళ్లందరికీ మంచి పేరొస్తుంది. డైరెక్టర్ రతన్ రిషి కూడా వరుసగా సినిమాలు దక్కించుకుంటాడని నమ్ముతున్నా.  చిత్రంతో సరికొత్త రొమాంటిక్ థ్రిల్లర్ చూస్తారు. మా మూవీ ట్రైలర్ కు హ్యూజ్ రెస్పాన్స్ ఇచ్చారు. సినిమాకు కూడా సక్సెస్ ఇస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.
 
డైరెక్టర్ రతన్ రిషి మాట్లాడుతూ - "ఆర్టిస్ట్" సినిమాను సెన్సార్ వారి సూచన మేరకు "కిల్లర్ ఆర్టిస్ట్" అని పెట్టుకున్నాం. హత్య చేయడాన్ని కళగా భావించే ఓ వ్యక్తి కథ ఇది. మన సొసైటీలో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా ఈ కథ రాసుకున్నాను. ఈ మర్డర్స్ ఒకరు చేస్తున్నారా ఇద్దరా అనేది ట్రైలర్ లో సస్పెన్స్ క్రియేట్ చేశాం. సినిమాలోనూ అదే క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. మర్డర్ ను గ్లోరిఫై చేస్తున్నామనే విమర్శలు వచ్చాయి. అయితే సమాజంలో ఎన్నో జరుగుతాయి. మనకు నచ్చేది తీసుకుంటాం. దాన్నే స్ఫూర్తి అంటాం. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ నుంచి ఈ కథ మొదలై రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ గా టర్న్ తీసుకుంటుంది. మా సినిమాలో బాహుబలి ప్రభాకర్, ఛత్రపతి శేఖర్..ఇలాంటి ఆర్టిస్టులంతా కొత్తగా మీకు కనిపిస్తారు. మా టీమ్ అంతా చాలా సపోర్ట్ చేశారు. మా మూవీ టీమ్ లోని ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెబుతున్నా. "కిల్లర్ ఆర్టిస్ట్" సినిమా మీకు కొత్త సినిమాటిక్ ఫీల్ కలిగిస్తుందని చెప్పగలను. అన్నారు.
 
లిరిసిస్ట్ రాంబాబు గోసాల మాట్లాడుతూ - "కిల్లర్ ఆర్టిస్ట్" మూవీ ఈ నెల 21న రిలీజ్ అవుతోంది. మీరంతా సినిమా చూసి పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నా. ఈ చిత్రంలో మూడు పాటలు రాశాను. లవ్ సాంగ్స్ తో పాటు బ్రేకప్ సాంగ్ ఉంటుంది. సాంగ్స్ కు మంచి లిరిక్స్ కుదిరాయి. సురేష్ బొబ్బిలి గారు హిట్ ట్యూన్స్ ఇచ్చారు. పాటలకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. అన్నారు.
 
సినిమాటోగ్రఫర్ చందూ ఏజే మాట్లాడుతూ - "కిల్లర్ ఆర్టిస్ట్" మూవీకి నేను సినిమాటోగ్రఫీ చేయగలను అని నమ్మి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్, ప్రొడ్యూసర్ కు థ్యాంక్స్. వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాననే అనుకుంటున్నా. మా మూవీకి మీరంతా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
 
హీరోయిన్ సోనియా ఆకుల, క్రిషేక పటేల్ మాట్లాడుతూ - ఎంతోమంది కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చిన "కిల్లర్ ఆర్టిస్ట్" సినిమా రిలీజ్ కు ముందే సక్సెస్ అయ్యిందని భావిస్తున్నా అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు