రజినీకాంతే ఆలోచిస్తున్నారు.. ఇక పవన్‌కు ఎందుకు?... కోట శ్రీనివాస రావు

సోమవారం, 11 జూన్ 2018 (08:59 IST)
రాజకీయాల్లోకి రావాలంటే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ వంటి అగ్ర హీరోనే ఒకటికి పదిసార్లు ఆలోచన చేస్తున్న సమయంలో హీరో పవన్ కళ్యాణ్‌కు రాజకీయాలు ఎందుకనీ, ఈ విషయంలో ఆయనే అర్థం చేసుకోవాలి కదా అని సీనియర్ సినీ నటుడు కోట శ్రీనివాస రావు అభిప్రాయపడ్డారు.
 
పవన్ పొలిటికల్ ఎంట్రీ, పొలిటికల్ టూర్‌పై ఆయన స్పందిస్తూ, ప్రజారాజ్యం అనుభవాల నుంచైనా ఆయన నేర్చుకోవాలి కదా, వాళ్ల అన్నకు ఏం జరిగిందో అర్థం చేసుకోవాలిగా అని వ్యాఖ్యానించారు. 
 
అంతేకాకుండా, తాను రాజకీయాల నుంచి బయటకు రావడానికి గల కారణాలను కూడా కోట వివరించారు. 'మనకెందుకు చెప్పండి.. నేనే రాజకీయాల నుంచి వెనక్కి వచ్చేశా. పిచ్చోడినై వచ్చానా? సినిమా వాళ్లకు ఆ వాతావరణం పడదు' అని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు