అప్పుడు రవితేజ దగ్గరకు కథ వెలితే రవితేజ చేయనని చెప్పేశాడు. ఆ తర్వాత ఆ కథ కళ్యాణ్ రామ్ దగ్గరకు వెళ్ళడం.. అతను ఓకే చెప్పడంతో తుది మెరుగులు దిద్దారు. నిర్మాత ఠాగూర్ మధు అందుకు సహకరించాడు. ఆ మెరుగులు సమయంలోనే ట్రైలర్‌లో చూపించిన . మామిడికాయ, నోటు, మేకు లాంటి పాయింట్ లు యాడ్ అయ్యాయి. ఇవన్నీ పడిన తరువాత స్క్రిప్ట్ బాగా వచ్చిందన్నవిషయం రవితేజ దగ్గరకు చేరింది. అ
ప్పుడు రవితేజ తెరముందుకు వచ్చాడు. చేసేది లేక కళ్యాణ్‌రామ్‌కు చిత్ర యూనిట్ క్షమాపణలు చెప్పింది. సినిమా రంగంలో ఇవి మామూలేకదా..అని మంచోడు కాబట్టి.. కళ్యాణ్‌రామ్ సరే అన్నాడు.. అయితే అది హిట్ అయి ఇంత పేరు వస్తుందిన ఎవ్వరూ ఊహించలేదు. ఇలా ఒకరికి వచ్చిన కథను మరోకరికి చేరడం అనేది చలనచిత్ర రంగంలో `రాసి పెట్టి వుండాలని` అనే సెంటిమెంట్ డైలాగ్‌లు మామూలుగా చెబుతుంటారు.
ఇక సేతుపతి.. కథే ఇది అని అంటే కాదు హీరోకు భార్య, పిల్లలు వుంటే అలా అనిపించి వుండొచ్చు. ఇలాంటి కథలు చాలా వున్నాయనే చెప్పాడు. ఏదిఏమైనా.. సేతుపతి కథను.. ఒంగోలు బేక్‌డ్రాప్.. చిన్నప్పుడు చూశాను.. అంటూ కబుర్లు చెప్పి... దర్శకుడు రవితేజతో హిట్ కొట్టేశాడు.