'వారియర్‌'లో బేబమ్మ మ్యాజిక్‌ మిస్‌.. లింప్‌ సింక్‌ కాలేదే!

సోమవారం, 18 జులై 2022 (14:12 IST)
'వారియర్‌' సినిమాలో బేబమ్మ మ్యాజిక్‌ మిస్‌ అయ్యిందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. బేబమ్మగా క్యూట్‌గా కనిపించిన కృతి.. ఈ సినిమాలో ఆర్జేగా కాస్త మాస్‌గా మారింది. 
 
అయితే ఈ క్రమంలో క్యూట్‌నెస్‌ పోయింది అని చెప్పొచ్చు. అలాగే ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌ విషయంలోనూ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కూడా సూచిస్తున్నారు. కృతి నవ్వితే చూడటం కష్టమైపోతోందని నెటిజన్ల కామెంట్లు కనిపిస్తున్నాయి.
 
కృతి నవ్వితే చూడటం కష్టమైపోతోందని నెటిజన్ల కామెంట్లు కనిపిస్తున్నాయి. కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ ఆర్టిఫిషియల్‌గా ఉన్నాయంటున్నారు కూడా. 
 
డబ్బింగ్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండటం లేదనే మాటలూ వినిపిస్తున్నాయి. పెదాల కదలికలో తప్పులు స్పష్టంగా తెలిసిపోతున్నాయని చెబుతున్నారు. ఈ విషయాలపై ఆమె దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 
 
'వారియర్‌' సినిమా ఫలితం కృతిని ఇబ్బంది పెడుతుంది. అయితే ఇప్పటికే ఆమె చేతినిండా సినిమాలుండటంతో ఇప్పటికిప్పుడు వచ్చే సమస్య లేదనే చెప్పాలి. అయితే తర్వాత ఇంకా సినిమాలు రావాలంటే ఎక్స్‌ప్రెషన్స్‌, లింప్‌ సింక్‌ విషయంలో ఆమె జాగ్రత్తలు తప్పనిసరి. 
 
అలాగే మరీ కమర్షియల్‌ సినిమాలకే ఓటేస్తే ఇంకా ఇబ్బంది అని చెప్పాలి. ఇక కృతి సినిమాల గురించి చూస్తే.. సుధీర్‌బాబుతో 'ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'లో నటించింది. త్వరలో ఈ సినిమా రిలీజ్‌ అవుతుంది. 
 
నితిన్‌తో 'మాచర్ల నియోజకవర్గం'లోనూ నటించింది. ఆ తర్వాత నాగచైతన్య- వెంకట్‌ ప్రభు సినిమాలో కూడా నటిస్తుంది. వీటితోపాటు తమిళంలో సినిమాలు ఒప్పుకుంటోంది. సూర్యతో 'అచలుడు' సినిమాలో నటిస్తోంది. ఇంకా కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయని టాక్‌.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు