ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ‘ప్రస్తుత కాలంలో హీరోయిన్లకు కూడా గుర్తింపు వస్తోంది. అలాంటప్పుడు ‘లుకా చుప్పి’ కేవలం కార్తిక్ వల్లే హిట్ అయిందని చెప్పడం సరి కాదు. ఒకవేళ సినిమాలో హీరోయిన్ పాత్రకు అంతగా ప్రాధాన్యం లేకుండా, మొత్తం హీరో చుట్టూనే తిరుగుతుంటే ఫరవాలేదు, గానీ సినిమా మొత్తం హీరోహీరోయిన్లు సమానంగా నడిపించినప్పుడు క్రెడిట్ కూడా ఇద్దరికీ సమానంగా దక్కాలి.