ఇంతకు ముందు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా అనౌన్స్‌మెంట్‌కు సంబంధించిన వీడియో, రీసెంట్‌గా రిలీజ్ చేసిన రైజ్ ఆఫ్ డ్రాగన్ అనే ఎనర్జిటిక్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి ఓ మెలోడీ గీతాన్ని విడుదల చేశారు.
లియోన్ జేమ్స్ అందించిన బాణీ, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, శరత్ సంతోష్, శ్రినిష జయసీలన్ గాత్రం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ పాటను యూరోప్‌లో షూట్ చేసినట్టుగా లిరికల్ వీడియోని చూస్తే అర్థం అవుతోంది. ఇక ఈ పాట వినడానికే కాకుండా చూడటానికి కూడా ఎంతో ప్లెజెంట్‌గా కనిపిస్తోంది.
ఈ ఎమోషనల్ మూవీకి అర్చనా కల్పాతి క్రియేట్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తుంటే ఐశ్వర్యా కల్పాతి అసోసియేట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రదీప్ ఇ.రాఘవ్ ఎడిటర్‌గా, ఎస్.ఎం.వెంకట్ మాణిక్యం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్రంలో కె.ఎస్.రవికుమార్, మిస్కిన్, వి.జె.సిద్ధు, హర్షత్ ఖాన్, అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్, మరియం జార్జ్, ఇందుమతి మణికందన్, తేనప్పన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో మెప్పించనున్నారు.