పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ ముని కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అందిస్తున్న ఈ మూవీ జనవరి 24న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ పాత్ర చాలా ఎమోషనల్ గా ఉండబోతోంది. ఈ మూవీ ప్రారంభోత్సవానికి పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు ప్రారంభం రోజు మూవీ మేకర్స్ ప్రకటిస్తారు.