`ద‌ర్బార్‌` తెలుగు మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేసిన సూప‌ర్ స్టార్ మ‌హేష్‌

శుక్రవారం, 8 నవంబరు 2019 (20:16 IST)
సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్‌మురుగదాస్‌ల ఫ‌స్ట్ క్రేజి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం `దర్బార్`. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పైన ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రజిని ఒక ప‌వ‌ర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న‌ సినిమాను అన్ని రకాల కమర్షియల్ హంగులతో మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు. 
 
లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన రజిని పోస్టర్స్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. తాజాగా దర్బార్ మూవి తెలుగు మోషన్ పోస్టర్‌ని సూపర్ స్టార్ మహేష్ విడుద‌ల చేశారు. ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌లో ర‌జినీకాంత్ క‌త్తితో విల‌న్స్ భ‌ర‌తం ప‌ట్టే స్టిల్‌ను విడుద‌ల చేశారు. 
 
అనిరుధ్ అభిమానుల‌ను ఆక‌ట్టుకునేలా ప‌క్కా మాస్ బీట్‌ను ఈ మోష‌న్ పోస్ట‌ర్‌కు ఇచ్చారు. “ర‌జినీకాంత్ సార్ ద‌ర్బార్ మోష‌న్ పోస్ట‌ర్‌ను షేర్ చేసుకోవ‌డం చాలా ఆనందంగా ఉంది. ఆయ‌న‌పై నాకు ఎప్ప‌టికీ ప్రేమ‌, గౌర‌వం ఉంటాయి. మురుగ‌దాస్ స‌హా ఎంటైర్ టీమ్‌కు అభినంద‌న‌లు“ అని మెసేజ్‌ను కూడా మ‌హేష్ పోస్ట్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు