పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాపై స్పందించినప్పుడు.. తెలుగు హీరోలు కూడా సపోర్ట్‌గా నిలిచారు. అందులో భాగంగానే మంచు మనోజ్ కూడా తన గళం కలిపారు. ఈ నెల 26న తను నటించిన 'గుంటూరోడు' సినిమా ఆడియో విడుదలవుతున్నట్లు సోమవారంనాడు ప్రకటించారు. అయితే మారిన పరిస్థితుల రీత్యా వాయిదా వేస్తున్నట్లు మంగళవారంనాడు వెల్లడించారు. తమిళనాడు జల్లికట్టు ఉద్యమం తరహాలో ఆంధ్రకు ప్రత్యేక హోదా కావాలని పలువురు మేధావులు అనడంతో ఇది పెద్ద చర్చగా మారింది. ఇండస్ట్రీలో కూడా పైకి చెప్పకపోయినా.. లోలోపల వారికి తమిళనాడు యువత పౌరుషాన్ని మెచ్చుకోలేకపోతున్నారు.
ఇక చంద్రబాబు నాయుడు.. జల్లికట్లుకు హోదాకు.. సంబంధమేమిటి? అని ప్రశ్నిస్తున్నా... అది పైపైకి మాత్రమేనని తెలుస్తోంది. ఏదిఏమైనా.. ఈ నెల 26న వైజాగ్‌లో పవన్ కళ్యాన్ చేపట్టే సభ సక్సెస్ కావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అందుకే తన సినిమా ఆడియోను వాయిదా వేస్తున్నట్లు తెలిసింది. అందుకు నిదర్శనంగా మనోజ్ విడుదల చేసిన వాయిదా పోస్టర్‌లో... 'ఎపి డిమాండ్స్ స్పెషల్ స్టేషన్' అంటూ స్లోగన్ ఇచ్చారు.