మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా వల్ల ఆగిపోయింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ కాగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. రామ్ చరణ్ కూడా ఆచార్యలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి ప్రజలను చైతన్యవంతుల్ని చేసే పనిలో వున్నారు. కరోనా బారిన పడకుండా ఇంటివద్దనే వుండండి. మాస్క్‌లు ధరించండి. ప్లాస్మా అవసరమైనవారికి దానం చేసి ప్రాణాన్ని కాపాడండి అంటూ వివరిస్తున్నారు.