సరిగ్గా ఇదే రోజు, ఇదే నెల, ఫిబ్రవరి 18వ తేదీన అంటే 72 సంవత్సరాల క్రితం, అన్నపూర్ణ తన జీవితంలోకి వచ్చి మన జీవితాలను తీర్చిదిద్దారు. అంటూ అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత అక్కినేని నాగార్జున గుర్తుచేస్తూ ట్వీట్ చేశారు. అప్పటి ఫొటోలను అందులో పొందుపరిచారు. అప్పటి పెళ్లిరోజు ఫొటోతోపాటు కొత్తలో నాగేశ్వరరావుగారు, అన్నపూర్ణమ్మగారు దిగిన ఫొటోలను నాగార్జున పోస్ట్ చేశాడు. మా అమ్మ, నాన్న జీవితంలో ప్రవేశించి మా జీవితాలను తీర్చిదిద్దారంటూ అప్పటి జ్ఞాపకాలను నెమరేసుకున్నాడు. ఈరోజు చాలా ప్రత్యేకం. 22 ఎకరాల అన్నపూర్ణ స్టూడియోను నాన్నగారు శ్రమించి ఒక రూపుకు తీసుకువచ్చారు. నేడు అది మరింత అభివృద్ధిచెంది సాంకేతికతను ఇమిడింపజేసుకుంటూ ఎందరో కార్మికులకు ఉపాధి కల్గిస్తుందని తెలియజేస్తున్నారు.