నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం తమ్ముడు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మూడ్ ఆఫ్ తమ్ముడు అంటూ సినిమాలోని పాత్రల్ని పరిచయం చేశారు. ఈ చిత్రంలోని ఇంపార్టెంట్ పాత్రలని, కారెక్టర్ నేమ్స్‌ను రివీల్ చేస్తూ వదిలిన మూడ్ ఆఫ్ తమ్ముడు అందరినీ ఆకట్టుకునేలా ఉంది.