bvsn prasad, Ajanish Loknath, Saitej and others
సుప్రీమ్ హీరో సాయితేజ్ నటిస్తున్న నూతన చిత్రానికి పాన్ ఇండియా సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల విక్రాంత్ రోణ, కాంతారా చిత్రాలకు సంగీతం అందించిన ఈ మ్యూజిక్ సన్సేషన్ ఇప్పుడు సాయితేజ్ నటిస్తున్న మిస్టికల్ థ్రిల్లర్‌కు అద్భుతమైన స్వరాలను, నేపథ్య సంగీతాన్ని అందించబోతున్నాడు. ఈ సందర్భంగా సంగీత పనులు జరుగుతున్నట్లుగా హీరో, నిర్మాత, సంగీతదర్శకుడిలతో ఫొటోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.