నా సామిరంగ నుంచి సీసా మూత ఇప్పు పాట విడుదల

డీవీ

శనివారం, 13 జనవరి 2024 (19:08 IST)
nagarjuna, naresh, raj tarun,
నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెన్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. పోస్టర్‌లు, టీజర్, ట్రైలర్ కు  ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
 
ఎంఎం కీరవాణి అందించిన పాటలు చార్ట్ బస్టర్ గా అలరిస్తున్నాయి. తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి 'సీసా మూత ఇప్పు' పాటని విడుదల చేశారు. కీరవాణి ఈ పాటని పుట్ ట్యాపింగ్ నెంబర్ గా కంపోజ్ చేశారు. ఆస్కార్ లిరిసిస్ట్ చంద్రబోస్ అందించిన లిరిక్స్ మాస్ ని అలరించేలా వున్నాయి.
 
మల్లికార్జున్, రేవంత్, సాయిచరణ్, లోకేష్, హైమత్,  అరుణ్ కౌండియా కలసి ఈ పాటని చాలా హుషారుగా ఆలపించారు. ఈ పాటలో నాగార్జున డ్యాన్స్ మూమెంట్స్ మాస్ ని కట్టి పడేస్తున్నాయి. నాగార్జునతో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కలసి డ్యాన్స్ చేయడం ప్రేక్షకులకు కన్నుల పండగలా వుంది. ఈ పాటకు థియేటర్స్ దద్దరిల్లిపోవడం ఖాయం.  
 
మంచి ప్రేమకథ, స్నేహం, భావోద్వేగాలు, మాస్, యాక్షన్ ఎలిమెంట్స్ కూడిన 'నా సామిరంగ' సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ.    
 
ఈ చిత్రంలో నాగార్జున సరసన ఆశికా రంగనాథ్ కథానాయికగా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్నారు.
 బ్లాక్ బస్టర్ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందించారు.
  నా సామిరంగ జనవరి14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల కానుంది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు