ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ అనే పదం మారింది : నాగబాబు
బుధవారం, 20 జనవరి 2021 (20:20 IST)
Adire Abhi
''ఇప్పుడు ఎంటర్ టైనేమేంట్ అనే పదం మారింది. ఈ రోజు సినిమా ఒక్కటే కాదు ఓటిటి , టివిలు, యూ ట్యూబ్ ఇలా చాలా ఉన్నాయి.. మంచి టాలెంట్ ఉంటె తప్పకుండా చాలా ప్లాట్ ఫార్మ్స్ ఉన్నాయి. అభిని చుస్తే నాకు తెలిసిన పోలీస్ అధికారులు గుర్తొస్తారు. అలా కనిపిస్తాడు అభి. అభి నటించిన పాయింట్ బ్లాంక్.సినిమాను తెలుగు ప్రేక్షకులు కూడా చూడాలి, అభి తప్పకుండా సినిమాలా, ఓటిటి అన్నది కాకుండా తప్పకుండా సక్సెస్ అవుతాడు. నాభిలో నటుడే కాదు మంచి డైరెక్టర్ కూడా ఉన్నాడు. భవిష్యత్తులో అభి నటుడిగానే కాకుండా దర్శకుడిగా ఎదగాలని కోరుకుంటున్నాను. కేవలం జబర్దస్త్ కమెడియన్ గానే కాకుండా నటుడిగా మరింత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను`` అన్నారు మెగా బ్రదర్ నాగబాబు .
అదిరే అభి, హీనా రాయ్ , రేచల్ హీరో హీరోయిన్లుగా వి వి ఎస్ జి దర్శకత్వంలో ఐశ్వర్యం మీడియా క్రియేషన్స్ పతాకంపై సస్పెన్స్ థ్రిల్లర్ పాయింట్ బ్లాంక్. డా.కొన్నిపాటి శ్రీనాథ్ నిర్మాత. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ యూ ఎస్ లో 9 జనవరి న విడుదలై సూపర్ వ్యూస్ ని సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సందర్బంగా చిత్ర యూనిట్ బుధవారం ఫిలిం ఛాంబర్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. . అభి 2013 నుండి తెలుసు.. చాలా డిసిప్లేన్ ఉన్న వ్యక్తి. చాలా మంచి కల్చర్ ఉన్న వ్యక్తి. రోజు జిమ్ మాత్రం వదలడు. మంచి ఆర్టిస్ట్, మంచి యాంకర్. అదుర్స్ అప్పటినుండి నాకు పరిచయం. ఆ తరువాత జబర్దస్త్ షో ద్వారా ఎక్కువగా దగ్గరయ్యాడు. తాను హీరోగా ప్రూవ్ చేసుకోవాలన్న తాపత్రయం చూస్తుంటే .. ఇప్పటికే ఎంతోమంది డిస్సప్పాయింట్ చేసినా కూడా ఏది పట్టించుకోకుండా ఈ రోజు ఇక్కడిదాకా రావడం .. పట్టువదలని విక్రమార్కుడిగా అనుకున్నది సాధించాలనే లక్ష్యంతో ఉన్నాడు. ఈ సినిమా అమెజాన్ అమెరికాలో విడుదల కావడం అక్కడ సక్సెస్ అందుకోవడం ఆనందంగా ఉంది అన్నారు.
ఈ సందర్బంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ .. మేం సినిమాల్లోకి వచ్చిన కొత్తలో సిల్వర్ జూబిలీ సెలెబ్రేషన్స్ చేసాం, ఆ తరువాత వందరోజుల వేడుకలు చేసాం. ఇప్పుడు వారం ఆడితే చాలు అనేది వచ్చింది. ఈ మధ్య అయితే ఇన్ని వ్యూస్ వస్తే చాలని అంటున్నారు. మారుతున్నా కాలంతో పాటు పరిస్థితులు మారుతున్నాయి. ఆర్టిస్టులు కూడా ఇలా వస్తున్నారు.. అలా పోతున్నారు. ఆ రోజుల్లో చిరంజీవి గారు, రవితేజ ఇలా పదేళ్లకు ఓ హీరో వస్తున్నాడు.. ఇప్పుడు మాధ్యమాలు మారిపోయిన తరువాత చాలా మందికి అవకాశాలు వస్తున్నాయి.
ఆ అవకాశాలను నిలబెట్టుకుని సక్సెస్ అవ్వాల్సిన సమయం ఇది. అలా వచ్చిన సినిమాలన్నీ జనాలు చూస్తారని కాదు.. ఇక్కడ కంటెంట్ ముఖ్యం. కంటెంట్ ఉంటె తప్పకుండా సినిమా చూస్తారని మరోసారి జనాలు నిరూపించారు. ఈ సినిమా చూడాలని ట్రై చేశాను.. కానీ కుదరలేదు. తప్పకుండా ఇలాంటి విజయం అందుకున్నందుకు టీం ను అభినందిస్తున్నాను. ఇక ఎప్పుడైనా సరే కష్టపడ్డవాడు తప్పకుండా నిలబడతాడు. అభి కూడా హీరోగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ఇక్కడ ఇండియాలో కూడా విడుదలై మరింత సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
వి ఎన్ ఆదిత్య మాట్లాడుతూ .. ఈ సినిమాకు గెస్ట్ లుగా వచ్చిన నాగబాబుగారు, భరద్వాజ్ గారు, లక్ష్మి భూపాల్ , అభి లాంటి వారు ఎలాంటి మాస్క్ లేకుండా నిజాయితిగా ఉంటారు.. వారి పనులు కూడా అలాగే ఉంటాయి. ఈ సినిమా అమెరికాలో ఉన్న మా ఫ్రెండ్స్ కి చెప్పగా అవుట్ అఫ్ 5 లో 4 . 4 పైగా రేటింగ్ వచ్చిందట. నిజంగా ఇంత గొప్ప సక్సెస్ అందుకున్న సినిమా మన తెలుగులో ఇంతవరకు విడుదల కాకపోవడం దురదృష్టకరం. ఇక్కడ తెలుగు మార్కెట్ లో కూడా ఓటిటి లు వచ్చాక కూడా హీరో ఉండాలి, ఇలా ఉండాలి అని కండిషన్స్ పెడుతున్నారు.. అది మారాలి, కంటెంట్ బాగుంటే చాలు విడుదల చేయడానికి ముందుకు రావాలి. ఇలాంటి సినిమా తీసిన నిర్మాతను అభినందిస్తున్నాను. ఇక అభి ఈశ్వర్ సినిమానుండి చాలా కష్టపడుతున్నారు. తప్పకుండా అతనికి మంచి భవిష్యత్ ఉంటుంది అన్నారు.
రైటర్ లక్ష్మి భూపాల్ మాట్లాడుతూ .. అభి నాకు చాలా కాలంగా తెలుసు. అభి చాలా కాలంగా హార్డ్ వర్క్ చేస్తూ స్ట్రగుల్ అవుతున్నారు. తప్పకుండా ఈ రోజు ఓ స్థాయికి చేరుకున్నారు. హీరోగా నిలబడాలంటే ఇంకాస్త టైం పడుతుంది. వెళ్ళాను ఇంతగా ప్రోత్సహిస్తున్న నాగబాబు గారికి థాంక్స్ చెప్పాలి. అలాగే ఈ సినిమాను నిర్మించిన నిర్మాత కు కూడా చాలా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.
నిర్మాత శ్రీనాథ్ మాట్లాడుతూ .. రియల్ ఎస్టేట్ లో ఉన్నాను.. ఈ కథ బాగా నచ్చడంతో సినిమాను నిర్మించాను. కోవిద్ టైం లో ఈ ప్రాజెక్ట్ సెట్ అయింది. సినిమా కూడా సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు నాగబాబు గారు పదిహేనేళ్ల పరిచయం.. అయన ఈ వేడుకలో పాల్గొన్నందుకు ఆనందంగా ఉంది అన్నారు.
రాజీవ్ మాట్లాడుతూ .. నేను డల్లాస్ నుండి వచ్చాను. ఈస్ట్ వెస్ట్ బ్యానర్ లో సినిమాలు చేస్తున్నాను. లాక్ డౌన్ లో ఈ సినిమా స్టార్ట్ చేసాం. కథ బాగా నచ్చడంతో అభి అన్న ద్వారా ఈ సినిమా చేయడం జరిగింది. విడుదల తరువాత ఈ సినిమాకు వస్తున్నా రెస్పాన్స్ చాలా బాగుంది. ఇంతమంచి అవకాశం ఇచ్చిన శ్రీనాథ్ గారికి థాంక్స్ అన్నారు.
హీరోయిన్ హీనా రాయ్ మాట్లాడుతూ .. ఈ సందర్బంగా చాలా ఎమోషనల్ గా ఉంది. ఎందుకంటే ఇది నా మొదటి సినిమా. ఈ సినిమాలో నేను డీ గ్లామరైజెడ్ పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాను. చాలా మంచి పాత్ర చేశాను. నిజంగా ఇది చాలా టఫ్ అయిన పాత్ర అయినా కూడా అభి గారి ప్రోత్సహంతో చేశాను. ఇంతమంచి అవకాశం ఇచ్చిన నిర్మాత, దర్శకులకు థాంక్స్. ఈ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్ అన్నారు.
అదిరే అభి మాట్లాడుతూ .. ఈ సినిమా కథను మల్లిక్ చింతకుంట చెప్పారో అప్పటినుండి మా సహా నిర్మాతలతో కలిసి శ్రీనాథ్ గారు మొదలెట్టారు. చాలా కష్టపడి ఈ సినిమాను ప్లాన్ చేసాం. ముక్యంగా గ్రిప్పింగ్ గా స్క్రీన్ ప్లే ఉంటె బాగుంటుంది అన్న ఆలోచనతో మొదలెట్టాం. మొదట్లో చాలా భయపడడం.. చిన్న సినిమాలకు జనాల సపోర్ట్ వస్తుందా లేదా అన్నది. కానీ ఎప్పుడైతే ఓటిటి లో విడుదల అయిందో .. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. నాకు ఇండస్ట్రీ లో పెద్దదిక్కు అంటే నాగబాబు గారే, అలాగే ఇక్కడికి వచ్చిన వి ఎన్ ఆదిత్య గారికి, లక్ష్మి భూపాల్ గారికి భరద్వాజ గారికి థాంక్స్ అన్నారు.