Venu Swamy: నాగ చైతన్య-శోభితలకు వేణు స్వామి క్షమాపణలు.. ఇకపై నోరెత్తను

సెల్వి

మంగళవారం, 21 జనవరి 2025 (20:38 IST)
Venu Swamy
సినీ నటులు నాగ చైతన్య, సమంతల విడాకులు గురించి రచ్చ రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. ఆపై నాగచైతన్య, శోభితల వివాహంపై వేణు స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. చైతూ-శోభిత వివాహంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ మహిళా కమిషన్​కు బహిరంగ క్షమాపణలు కోరారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నేరళ్ల శారదకు రాతపూర్వకంగా లేఖను అందజేశారు. 
 
చై-శోభిత విడాకులు తీసుకుంటారని జ్యోతిష్యం చెప్పారు. వేణు స్వామి వ్యాఖ్యలపై తెలంగాణ ఉమెన్ కమిషన్​కి ఫిలిం జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. 
 
ఉమెన్ కమిషన్ ముందు హాజరు కావాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వేణు స్వామికి మరొకసారి ఉమెన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుపై స్పందించిన వేణు స్వామి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఎవరినీ ఇబ్బంది కలిగించే హామీ ఇచ్చారు.

తెలంగాణ మహిళా కమిషన్‌ ఎదుట బహిరంగంగా క్షమాపణ చెప్పిన వేణు స్వామి.

నాగచైతన్య- శోభితల వైవాహిక బంధంపై చెప్పిన జోస్యాన్ని వెనక్కి తీసుకొంటూ క్షమాపణ కోరిన వేణు.#Telangana #VenuSwamy #UANow pic.twitter.com/maPsh5nh84

— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) January 21, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు