వరుణ్ తేజ్‌తో సాయిపల్లవి పెళ్ళి.. నాగబాబు ఏమన్నారంటే..? (Video)

మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (10:15 IST)
మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం తెలుగు బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన రాజమౌళి, ప్రభాస్ 'ఛత్రపతి' హిందీ రీమేక్‌లో విలన్‌గా యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ సినిమాను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా హిందీలో వివి వినాయక్ ఈ సినిమాతో దర్శకుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో నాగబాబు మెయిన్ విలన్‌గా నటించబోతున్నాడు. 
 
త్వరలో నాగబాబు ఈ సినిమాలో నటించే విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. ఈ సంగతి పక్కన పెడితే.. ఎపుడు అభిమానులతో దగ్గర ఉండే నాగబాబు.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో చిట్‌చాట్ చేసాడు.
 
ఈ సందర్భంగా ఓ అభిమాని మాట్లాడుతూ.. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ పెళ్లి విషయమై మెగాబ్రదర్‌కు సలహా ఇచ్చాడు. ఇంతకీ అదేమిటంటే.. వరుణ్ తేజ్‌కు హీరోయిన్ సాయి పల్లవితో మ్యారేజ్ చేస్తే బాగుంటుందని సూచించాడు. నెటిజన్ అలా చెప్పడంతో నాగబాబు నిర్ఘాంత పోయాడు. ఏం చేయాలో తెలియని నాగబాబు... జాతి రత్నాలు సినిమాలో బ్రహ్మానందం జడ్జి స్థానంలో కూర్చున్న ఫోటోను ఎమోజీగా పెట్టారు.
 
మీకు మీరే తీర్పు చెప్పుకోండి నేను జడ్జి ప్లేస్ నుంచి వెళ్లిపోతానంటూ ఎక్స్‌ప్రెషన్ వచ్చే ఫోటో పెట్టాడు. మొత్తంగా నాగబాబు.. వరుణ్ తేజ్‌కు త్వరలోనే పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇక వరుణ్ తేజ్ విషయానికొస్తే.. ఈ ఇయర్ 'గని' మూవీతో పాటు 'ఎఫ్ 3' మూవీలతో పలకరించనున్నాడు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు