ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై ప్రముఖ సినీనటుడు నాగార్జున తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ టి వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. ఈక్రమంలో కూల్చివేతలు ఆపాలని హైకోర్టు మధ్యతర ఉత్తర్వులు జారీ చేసింది.ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు ఆపాలని హైకోర్ట్ స్టే. ఈక్రమంలో కూల్చివేతలు ఆపాలని హైకోర్టు మధ్యతర ఉత్తర్వులు జారీ చేసింది.
దీనిపై నాగార్జున సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. స్టే ఆర్డర్‌లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. మా ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుట కొరకు ఈ ప్రకటనను జారీ చేయడం సరైనదని నేను భావించాను.
ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని.
తాజా పరిణామాల వల్ల, మేము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశముంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం.