Refresh

This website p-telugu.webdunia.com/article/telugu-cinema-news/nandamuri-balakrishna-golden-jubilee-celebrations-in-new-england-america-124091700022_1.html is currently offline. Cloudflare's Always Online™ shows a snapshot of this web page from the Internet Archive's Wayback Machine. To check for the live version, click Refresh.

అమెరికా న్యూ ఇంగ్లాండ్ లో నందమూరి బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ సెలెబ్రేషన్స్

డీవీ

మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (12:24 IST)
Balakrishna Golden Jubilee Celebrations cake
నందమూరి నటసింహం బాలకృష్ణ తెలుగు చలన చిత్ర రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్బంగా అమెరికాలో బాలయ్య అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. సెప్టెంబర్ 14 న అమెరికా న్యూ ఇంగ్లాండ్ లో శ్రీ బోళ్ల, తరణి పరుచూరి అధ్వర్యంలో గోల్డెన్ జూబ్లీ సెలెబ్రేషన్స్ ను అత్యంత ఘనంగా నిర్వహించారు.
 
ఇక ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా పూర్తి కావడానికి "రావి  అంకినీడు ప్రసాద్, అశ్విన్  అట్లూరి, శ్రీనివాస్ గొంది, అనిల్ పొట్లూరి , శ్రీకాంత్ జాస్తి ,సురేష్ దగ్గుపాటీ, సూర్య తెలప్రోలు, చంద్ర వల్లూరుపల్లి ,రావ్ కందుకూరి,శశాంక్ , దీప్తి కొర్రపల్లి, కాళిదాస్ సూరపనేని "  సహకరించారు. ప్రస్తుతం ఈ ఈవెంట్ కు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలను చూసిన నందమూరి బాలయ్య అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య అభిమానులు ఆ వీడియోలను ఇంటర్నెట్ లో ట్రెండ్ చేస్తున్నారు.  
 
ఈ వేడుకకు అమెరికాలోని జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ కేక్ కట్టింగ్ చేశారు. ఈ కార్యక్రమానికి సుప్రీతా, శశాంక్ లు వ్యాఖ్యతగా వ్యవహరించగా, బాలయ్య అభిమానులల్లో మరింత జోష్ ను పెంచేందుకు సింగర్స్ హర్షిత యార్లగడ్డ, రాజీవ్ లు బాలయ్య పాటలను పాడి, ఆడి నందమూరి అభిమానులను అలరించారు.. అనంతరం ప్రముఖ క్లాసికల్ డ్యాన్సర్ శ్రీ శైలజ చౌదరి అండ్ గ్రూప్ వారి నృత్య ప్రదర్శన నందమూరి అభిమానులను ఆకట్టుకుంది. వారి డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఈవెంట్ కు హైలెట్ గా నిలిచింది.
 
ఇక ఇటీవల సెప్టెంబర్ 1 వ తారీఖున హైదరాబాద్ లో బాలయ్య అభిమానులు, సినీ ప్రముఖులు హైదరాబాద్ లో గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇక బాలకృష్ణ 1974 లోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి తాతమ్మ కల అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు.. అలా ఒక్కో సినిమాతో తన టాలెంట్ తో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. 50 ఏళ్లు గా సక్సెస్ ఫుల్ హీరోగా ఇప్పటికి వెలుగొందడం విశేషం.. జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో నటించి ఆ పాత్రలకు ప్రాణం పోసారు.. కొన్ని పాత్రలకు బాలయ్య తప్ప మరెవ్వరు సెట్ కారు అన్నంతగా ఆ పాత్రలో జీవిస్తాడు. ఇలాంటి మరెన్నో చిత్రాలతో ప్రజల ముందుకు రావాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు..
 
ఇక బాలయ్య సినిమాల విషయానికొస్తే.. 1974 సంవత్సరంలో తాతమ్మ కల చిత్రంతో నటసార్వభౌమ, స్వర్గీయ ఎన్టీఆర్ నట వారసుడిగా వెండితెరకి పరిచయమై తన అద్భుత నటనతో అంచెలంచెలుగా ఎదిగారు నందమూరి నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ. అంతేకాకుండా " తండ్రికి తగ్గ తనయుడుగా అందరి ప్రశంసలు పొంది , విశ్వవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు 

 ప్రస్తుతం బాలయ్య డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు