నందమూరి కళ్యాణ్ రామ్ మ‌ళ్లీ ఆ నిర్మాత‌కు ఛాన్స్ ఇచ్చాడా..?

బుధవారం, 30 అక్టోబరు 2019 (22:10 IST)
డైన‌మిక్ హీరో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ ఈ సంవత్సరం యాక్ష‌న్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ `118`తో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో వచ్చిన ఈ సినిమా అటు విశ్లేషకులను ఇటు ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసినదే. ఇప్పుడు ఈ కాంబినేషన్ మరొకసారి పట్టాలెక్కబోతోంది. 
 
ఇటీవలి కాలంలో తమిళ్ స్టార్ విజయ్ నటించిన “విజిల్” చిత్రాన్ని తెలుగులో దిగ్వియజంగా సమర్పించిన ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. 
 
నిర్మాత మ‌హేశ్ కోనేరు మాట్లాడుతూ – దళపతి విజయ్ నటించిన “విజిల్” చిత్రాన్ని దీపావళికి తెలుగు రాష్ట్రాలలో విడుదల చేసాము. ఈ చిత్రం భారీ వసూళ్లతో, చక్కటి ప్రేక్షకాదరణతో ప్రదర్శింపబడుతోంది. 
 
ఈ శుభసందర్భంలో మా బ్యానర్లో మరొక కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌ గారు మా బ్యానర్‌కు “118” చిత్రంతో అద్భుతమైన విజయాన్ని అందించారు. ఇప్పుడు మళ్ళీ మా బ్యానర్లో ఒక చిత్రాన్ని చేయబోతున్నారు. ఒక కొత్త తరహా కథతో రూపొందబోతున్న ఈ చిత్రం వివరాలను త్వరలోనే తెలియజేస్తాం” అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు