అనంతరం ఆయన ట్వీట్ చేస్తూ... ఈ సినిమా ప్రీమియర్ చూసి ముగ్దులమయ్యామని వారన్నారు. ఈ మూవీ ద్వారా అమరావతి గొప్పదనాన్ని తెలుసుకున్నామని, దీన్ని అద్భుతంగా తెరకెక్కించారని, బాలయ్య నటన సూపర్ అంటూ అల్లుడు లోకేష్ ట్వీట్ చేశారు.
అలాగే, సినిమా చూసిన ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. భూతద్దం పెట్టి వెతికినా ఒక్కంటే ఒక్క నెగటివ్ పాయింట్ దొరకడం లేదు. అన్ని పాజిటివ్ పాయింట్స్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన 'గౌతమీపుత్ర శాతకర్ణి'పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఓ హాలీవుడ్ చిత్రానికి ఏమాత్రం తీసిపోని లెవల్లో 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. యుద్ధ సన్నివేశాల్లో బాలయ్య నటన అద్భుతమని వ్యాఖ్యానిస్తున్నారు. ఒంటిచెత్తో సినిమాని నడిపించాడు. సాయి మాధవ్ బుర్రా డైలాగులు, జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ, చిరంథన్ భట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా రేంజ్‌ని పెంచేలా ఉన్నాయని పేర్కొంటున్నారు.
ఇలాంటి ఓ చారిత్రాత్మక చిత్రాన్ని తక్కువ బడ్జెట్లో.. తక్కువ టైంలో ఇంత క్వాలిటీగా.. ఓ హాలీవుడ్ చిత్రానికి ఏమాత్రం తీసిపోని రేంజ్లో తీసిన దర్శకుడు క్రిష్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రియా జతకట్టింది. తల్లిగా అలనాటి హీరోయిన్ హేమమాలిని నటించింది. ఈ చిత్రానికి సంగీతం చిరంతన్ భట్.