రైజింగ్ డ్రీమ్స్ ప్రొడక్షన్ సమర్పణలో జ్ఞాన్ ప్రకాశ్, సూర్య శ్రీనివాస్, ప్రియాంక పల్లవి ప్రధాన పాత్రల్లో బాషా మజహర్ నిర్మించిన చిత్రం `నేనొస్తా`. పరంధ్ కళ్యాణ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 30న గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన `పెళ్లి చూపులు` చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ...``ట్రైలర్ చూశాక దర్శకుడిలోని ప్రతిభ, మాట్లాడాక నిర్మాతకున్న క్లారిటీ ఏంటో అర్థమైంది. దర్శక నిర్మాతలిద్దరికీ కూడా మంచి భవిష్యత్ ఉంది. ఈ సినిమాకు హిట్టయ్యే లక్షణాలు మెండుగా కనిపిస్తున్నాయి. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ మంచి క్వాలిటీ తో ఉన్నాయి. యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు.
చిత్ర నిర్మాత బాషా మజహర్ మాట్లాడుతూ...``దర్శకుడు పరంధ్ కళ్యాణ్ మంచి కథతో నన్ను అప్రోచ్ అయ్యాడు. కథ నచ్చి యంగ్ అండ్ ఎనర్జిటిక్ టీమ్‌ను సెలక్ట్ చేసుకుని... సినిమాను సిన్సియర్‌గా తెరకెక్కించాము. నిత్యం మనకు ఎదురయ్యే పాత్రలతో పాటు ఓ టిపికల్ క్యారక్టర్ మా సినిమాలో ఉంటుంది. ఆ క్యారక్టర్ నిజ జీవితంలో మనకు ఎదురైతే ఏంటి పరిస్థితి అన్నదే చిత్ర కథాంశం. లవ్, రొమాన్స్, థ్రిల్లింగ్ అంశాలతో ఆద్యంతం ఆకట్టుకునేలా సినిమా ఉంటుంది. మా సినిమా నచ్చి అభిషేక్ పిక్చర్స్ వారు నైజాంలో విడుదల చేయడానికి ముందుకు రావడం మాకు దక్కిన తొలి విజయంలా భావిస్తున్నాం. ఈ నెల 30న గ్రాండ్‌గా సినిమాను విడుదల చేస్తున్నాం`` అన్నారు.
దర్శకుడు పరంధ్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ``ఎంతో ఇష్టంతో కష్టపడి చేసిన సినిమా ఇది. లవ్, రొమాన్స్, థ్రిల్లింగ్ అంశాలు ఆకట్టుకునేలా ఉంటాయి. మా ఆర్టిస్ట్స్ మరియు టెక్నీషియన్స్ పూర్తి సహకారం వల్ల మంచి అవుట్ వచ్చింది. ఈ నెల 30న విడుదలవుతోన్న మా చిత్రం అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉందన్నారు.
సంధ్యాజనక్ మాట్లాడుతూ...``యంగ్ టీమ్ చేసిన మంచి ప్రయత్నం `నేనొస్తా`. నేను హీరో మదర్ గా నటించా. దర్శక నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా ఎంతో పాషన్ తో సినిమాను రూపొందించారన్నారు. హీరో జ్ఞాన్ ప్రకాశ్ మాట్లాడుతూ...``హీరో అవ్వాలన్నది నా పదేళ్ల కల. ఈ సినిమాతో నెరవేరుతుంది. నా పాత్ర చాలా టిపికల్ గా ఉంటుంది. ఇంత మంచి అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలిద్దరికీ థ్యాంక్స్`` అన్నారు.