ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నా మాతృభాష కన్నడం. నేను ఇంజనీరింగ్ పూర్తిచేశాను. టెక్కీగా రెండేళ్లపాటు పని చేశాను. అయితే, చిన్నవయసు నుంచి నాకు సినిమాలంటే ఎంతో ఇష్టం. నా ఫ్రెండ్స్ కూడా సినిమాల్లో నటించాలని ఎంకరేజ్ చేశారు. కానీ, మంచి జాబ్ వదులుకుని సినిమాల్లోకి వెళ్లడం ఎందుకని తల్లిదండ్రులు ప్రశ్నించారు. కానీ, ఇక్కడ ఎంతో కొంత సాధించాలనే పట్టుదలతో ఇక్కడకు వచ్చాను.
'నేను మీకు బాగా కావాల్సినవాడిని' సినిమాలో నా పాత్రకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కొత్తగా వచ్చిన హీరోయిన్స్‌కి ఇలాంటి రోల్స్ దొరకడం కష్టం. నా యాక్టింగ్ బాగుందని అందరూ అంటుంటే చాలా సంతోషంగా ఉంది. అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. కథలు వినడంలో బిజీగానే ఉన్నాను. కథకి అవసరమైనంత వరకూ స్కిన్ షో చేయడానికి ఓకే .. అంతకు మించిన పరిధిని దాటేది మాత్రం లేదు" అని తెగేసి చెప్పింది.