నెట్ ఫ్లిక్స్ నుంచి ఈ ఏడాది అద్భుతమైన వెబ్ సిరీస్, అందరినీ అలరించే కంటెంట్ రాబోతోంది. ఈ ఏడాదిలో తమ నుంచి వచ్చే ప్రాజెక్టుల వివరాల్ని నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. కామెడీ, ఫ్యామిలీ, యాక్షన్, రొమాన్స్, స్పోర్ట్స్ డ్రామా ఇలా అన్ని జానర్లను టచ్ చేస్తూ నెట్ ఫ్లిక్స్ ఈ ఏడాది ఊహించని స్థాయిలో వినోదాన్ని పంచేందుకు రెడీగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 700 మిలియన్లకు పైగా వీక్షకులను సంపాదించుకున్న నెట్ ఫ్లిక్స్ ఈ ఏడాది సరి కొత్త కంటెంట్‌ను పంచేందుకు రెడీ అయింది.
మాధవన్, సిద్దార్థ్, నయనతార, మీరా జాస్మిన్ వంటి అద్భుతమైన తారాగణంతో ఎస్. శశికాంత్ టెస్ట్ అనే సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. ఏ వైనాట్ స్టూడియో బ్యానర్ మీద చక్రవర్తి రామచంద్ర, ఎస్. శశికాంత్ నిర్మిస్తున్నారు. జీవితమే ఓ ఆట అనే కాన్సెప్ట్‌తో ఈ టెస్ట్ రాబోతోంది. భిన్న మనస్తత్వాలు, భిన్న దారుల్ని ఎంచుకున్న ముగ్గురు వ్యక్తుల జీవితాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. లవ్, అంతులేని కలలు, లక్ష్యాలు, కోరికలు, క్రికెట్ వంటి ఎమోషన్స్ చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుంది. నెట్ ఫ్లిక్స్‌తో కలిసి ఈ సిరీస్‌ను అందరికీ అందిస్తుండటం ఆనందంగా ఉందని నెట్ ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనిక షెర్గిల్ అన్నారు.
దర్శకత్వం: S. శశికాంత్, కథ: ఎస్. శశికాంత్, నిర్మాణం: చక్రవర్తి రామచంద్ర & S. శశికాంత్ (A YNOT స్టూడియోస్ ప్రొడక్షన్)
రానా నాయుడు సీజన్-2 కూడా రెడీ అయింది. రానా నాయుడు ఫస్ట్ సీజన్‌కు వచ్చిన ఆదరణ అందరికీ తెలిసిందే. ఇక ఈ రెండో సీజన్‌లో రానా నాయుడికి ఎదురైన కొత్త సమస్య ఏంటి? తన ఫ్యామిలీని రక్షించుకునేందుకు రానా నాయుడు ఏం చేశారు? గతంలో చేసిన పనుల వల్ల ఏర్పడిన ఈ కొత్త సమస్యలు ఏంటి? అనే ఆసక్తికరమైన అంశాలతో రెండో సీజన్ ఉంటుంది.
లోగో మోటివ్ గ్లోబల్ మీడియా నిర్మాత సుందర్ అరోన్ మాట్లాడుతూ.. రానా నాయుడు రెండో సీజన్‌ను అందరి ముందుకు తీసుకు వస్తున్నందుకు నాకు ఆనందంగా ఉంది. ఫస్ట్ సీజన్ కంప్లీట్ అయిన వెంటనే ఈ రెండో సీజన్ పనులు ప్రారంభించాం. ఈ రెండో సీజన్ స్టోరీ, స్క్రీన్ ప్లే, పెట్టిన బడ్జెట్ చూసి ఆడియెన్స్ ఫిదా అవుతారు. నెట్ ఫ్లిక్స్ సహకారంతో ఈ రెండో సీజన్‌ను అద్భుతంగా తెరకెక్కించాం. ఈ రెండో సీజన్ చూసిన తరువాత ఆడియెన్స్ అంతా ఆశ్చర్యపోతారు. ఎదురు చూపులకు తగ్గ ప్రతిఫలం దక్కిందని చెబుతారు అని అన్నారు.