తాను చూసిన ఫస్ట్ మూవీ 'జురాసిక్ పార్క్' అని సమంత తెలిపింది. తాను టాటూలు వేయించుకోకూడదని అనుకున్నానని... కానీ ఆ తర్వాత వేయించుకున్నానని తెలిపింది. టాటూలు ఎవరూ వేయించుకోవద్దని, ఆ ఆలోచన కూడా మానుకోవాలని సూచించింది.
సమంత నడుము పైభాగంలో తన మాజీ భర్త నాగచైతన్య పేరు 'చై' అనే టాటూ ఉన్న సంగతి తెలిసిందే. వీపుపై, కుడి చేతిపై మరో రెండు టాటూలు ఉన్నాయి. విడాకుల తర్వాత సమంత టాటూలు వేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే తన ఫ్యాన్సుకు కూడా టాటూలు వేయించుకోవద్దని చెప్పినట్లు సమాచారం.