రాహుల్, ప్రియదర్శినిని కన్విన్స్ చేసినప్పుడే హిట్ అని ఫిక్స్ అయ్యా: హీరో శ్రీవిష్ణు

డీవీ

శనివారం, 23 మార్చి 2024 (19:20 IST)
om bheem bush success
హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన అవుట్ అండ్ అవుట్- ఎంటర్‌టైనర్ 'ఓం భీమ్ బుష్' . వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి ఈ సినిమాని నిర్మించగా, యువి క్రియేషన్స్ సమర్పించింది. మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల 'ఓం భీమ్ బుష్' అన్ని వర్గాల ప్రేక్షకులని హిలేరియస్ గా అలరించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకులు మారుతి ఈ వేడుకలో ముఖ్య అతిధులుగా ఈ వేడుకలో పాల్గొన్నారు. యంగ్ డైరెక్టర్ రామ్ అబ్బరాజు, హసిత్ గోలి, పవన్ సాదినేని తదితరలు హాజరైన ఈ వేడుక గ్రాండ్ గా జరిగింది.
 
సక్సెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్.. ఈ ట్యాగ్ లైన్ పెట్టాలంటే ధైర్యం వుండాలి. ఆ ట్యాగ్ లైనే 'ఓం భీమ్ బుష్'. హర్ష రౌడీ బాయ్స్ చేసినప్పుడే కొత్త కథలు చేయాలని అనేవారు. నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వాలని చేసిన ప్రయత్నం ఈవాళ థియేటర్స్ లో లాజిక్ లేదు ఓన్లీ మ్యాజిక్ అని నిరూపించి సమ్మర్ ఎంటర్ టైనర్ గా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. థియేటర్ కి వెళితే నవ్వుకుని వస్తున్నామని ప్రేక్షకులే చెబుతున్నారు. హర్ష, శ్రీవిష్ణు టీం అందరికీ అభినందనలు. మంచి ఎంటర్ టైనర్ సినిమా ఈ సమ్మర్ కి వచ్చింది. అందరూ థియేటర్స్ కి వెళ్లి ఎంజాయ్ చేయండి' అన్నారు.
 
డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ, శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఈ ముగ్గురి కాంబినేషన్ ని కలపడమే ఈ విజయం. ప్రేక్షకులని తప్పకుండా అలరించాలనే టెన్షన్ ఆ ముగ్గురిలో గమనించాను. చాలా గొప్పగా యాక్ట్ చేశారు. దర్శకుడు అద్భుతంగా కథ రాసుకుంటే.. ఈ ముగ్గురు ఇంకా అద్భుతంగా నటించారు' తెలిపారు.  
 
హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ..హర్ష ఈ కథ చెప్పినప్పుడు థియేటర్స్ లో కడుపుబ్బా నవ్వించాలని నిర్ణయించుకునే ఈ సినిమా చేశాను. అది ఈ రోజు అద్భుతంగా నిరూపితమైయింది. ఈ కథ చెప్పి రాహుల్, దర్శిని కన్విన్స్ చేసి తెచ్చినప్పుడే ఈ సినిమా విజయం సాధిస్తుందని ఫిక్స్ అయ్యాను. రాహుల్, దర్శి పాత్రలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. థియేటర్స్ లో విజల్స్ పడుతున్నాయి. యూత్ తో పాటు ఫ్యామిలీస్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా చివరి ఇరవై నిమిషాలకు మహిళా ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వస్తోంది. సినిమా చూసిన వారంతా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. శ్రీకాంత్ చాలా అద్భుతంగా ప్రొడక్షన్ డిజైన్ చేశారు. రాజ్ తోట గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. సన్నీ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. తను మరిన్ని మంచి సినిమాలు చేయాలి. నిర్మాతలు వంశీ, సునీల్ గారు చాలా గొప్పగా ప్రోత్సహించారు. వారి నిర్మాణంలో మళ్ళీ మళ్ళీ పని చేయాలని వుంది. సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా చాలా రోజులు ఆడబోతుంది. వెంటనే గ్యాంగ్స్ తో వెళ్ళండి. ఖచ్చితంగా నవ్వుకొని వస్తారు, ఇంతలా నవ్వుకోవడం చాలా అరుదుగా జరుగుతుంది. సినిమాకి వెళ్ళండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు'' అన్నారు.
 
దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి మాట్లాడుతూ... థియేటర్స్ లో ప్రేక్షకులు సినిమా చూసి పగలబడి నవ్వుతున్నారు. వారి నవ్వులు చూసిన తర్వాత మేము రెండేళ్ళు పడిన కష్టం మర్చిపోయాం. ప్రిమియర్స్ నుంచే మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా చూసిన వారంతా చాలా అద్భుతంగా వుందని చెప్పారు. మంచి రివ్యూస్ వచ్చాయి. ఇలాంటి సినిమా గ్యాంగ్స్ తో వెళ్లి చూస్తే ఇంకా మజా వుంటుంది. తప్పకుండా థియేటర్స్ లో నే చూడండి. చాలా సున్నితమైన అంశం ఇందులో వుంది. ఇలాంటి కథని అంగీకరించాలంటే నిర్మాతలకు ధైర్యం కావాలి.  ఈ కథని అంగీకరించిన వంశీ అన్నకి ధన్యవాదాలు. ఆయన ఇండియాలోనే బెస్ట్ ప్రొడ్యూసర్. ఆయన లాంటి నిర్మాతలు దొరకడం నా అదృష్టం. విష్ణు గారు కథ చెప్పినప్పటి నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఆయన డబ్బింగ్ లో చేసిన కరెక్షన్స్ సినిమాకి చాలా హెల్ప్ అయ్యాయి. ఆయన కామిక్ టైమింగ్ లో విశ్వరూపం చూపించారు. క్లైమాక్స్ లో ఎమోషనల్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవల్ చేశారు. దర్శి, రాహుల్ కూడా అద్భుతంగా చేశారు.  దర్శి సెకండ్ హాఫ్ లో విజ్రుభించారు. రాహుల్ త్రూ అవుట్ క్యారెక్టర్ లోనే ఉంటూ అలరించారు. ఈ సినిమాకి పని చేసిన టెక్నిషియన్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.’ తెలిపారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు