త్రినాధ్ కఠారి హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత బళ్లారి శంకర్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇట్లు మీ ఎదవ. తెలుగు అమ్మాయి సాహితీ అవాంచ హీరోయిన్ గా నటిస్తున్నారు. వెయేళ్ళు ధర్మంగా వర్ధిల్లు అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఇట్లు మీ ఎదవ టైటిల్ చాలా కొత్తగా వుంది. ఉన్నట్ట మరి లేనట్ట సాంగ్ చాలా అద్భుతంగా వుంది. ఆర్పీ పట్నాయక్ గారు ఎక్స్ట్రార్డినరీగా కంపోజ్ చేశారు. త్రినాధ్, సాహితీ జోడి చాలా బావుంది. ప్రొడ్యూసర్ శంకర్, డిఓపి జగదీష్ నాకు మంచి మిత్రులు. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను అని చెప్పారు.
ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్, సురభి ప్రభావతి, మధుమణి, తాగుబోతు రమేష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
తారాగణం: త్రినాధ్ కఠారి, సాహితీ అవాంచ, తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్, నవీన్ నేని, సురభి ప్రభావతి, మధుమణి, తాగుబోతు రమేష్, చలాకీ చంటి, జబర్దస్త్ నూకరాజు, జెమినీ సురేష్, డీడీ శ్రీనివాస్, రామజగన్