Prabhu Deva, Rishi Raghavendra
సినిమా రంగంలో ప్రభుదేవా పేరు తెలియని వారు ఉండరు. దశాబ్దాలపాటు డ్యాన్స్ చరిత్రలో ఓ పేజీ ఉండేలా చేసుకున్న ఆయన ఆమధ్య కొన్ని వివాదాలకు వేదిక అయ్యారు. నటుడిగా, దర్శకుడుగా, కొరియోగ్రాఫర్ గా ప్రజ్ఞను చాటుకున్న ఆయన తాజాగా తన వారసుడిని వెలుగులోకి తెచ్చారు. ఇటీవలే చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్ లో ప్రభుదేవా, కొడుకు రిషి రాఘవేంద్రను అందరికి పరిచయం చేసి కలిసి డాన్స్ చేయడం విశేషం.