దీనిపై పరుచూరి మాట్లాడుతూ.. 14 మంది వ్యక్తిత్వాలను బయట కూర్చొన్న వ్యక్తి విశ్లేషించడం సాధారణ విషయం కాదని, కానీ చిన్న రామయ్య దానిని అవలీలగా చేస్తే.. నాని హోస్టింగ్ ద్వారా ఈ షోను చాలా క్లాసీగా, అద్భుతంగా నడిపాడని తెలిపారు.
ఇక నాగార్జున ‘మన్మథుడు’లా చేశారని ప్రోమోని బట్టి అర్థమవుతోందన్నారు. ఈ కార్యక్రమం చూసే మహిళా ప్రేక్షకులు, బిగ్ బాస్ ఇంట్లో ఉండే కంటెస్టెంట్లను చూడాలా? లేదంటే నాగ్‌ని చూడాలో అర్థం కాక తికమక పడతారని పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా నాగ్‌తో పాటు కంటెస్టంట్లందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.